KTR: మూసారం బాగ్ బ్రిడ్జి వద్ద మూసి నదిని మంత్రి కేటీఆర్ పరిశీలించారు. హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌లో వరద పరిస్థితిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్‌తో కలిసి మంత్రి కేటీఆర్ పరిశీలించారు. సహాయక చర్యలుచేపట్టాలని మంత్రి సూచించారు. ఎటువంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వర్షం కారణంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని, సహాయక చర్యలు చేపట్టలని ఆదేశించారు. ప్రజలు ఎటువంటి ఇబ్బంది తలెత్తకూడదని తెలిపారు. అత్యవసర సహాయం కోసం అధికారులు, జీహెచ్ఎంసీ సిబ్బంది అలర్ట్ గా ఉండాలని ఆదేశించారు. మూసీనదికి ఎక్కువ మోతాదులో నీరు చేరాయని మూసారం బాగ్ బ్రిడ్జి వద్ద నీరు ఏరులై పారుతుందని కానీ.. ప్రమాదం ఏమీ లేదని తెలిపారు. ప్రజలకు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. ఎటువంటి సహాయక చర్యలకు అధికారులు అందుబాటులో ఉంటారని అన్నారు. మూసీ నది పరివాహక ప్రాంతప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాన్ని లెక్క చేయకుండా మూసారం బాగ్ బ్రిడ్జి పరివాహన ప్రాంత ప్రజలను స్వయంగా మంత్రి కేటీఆర్ కలిసి ధైర్యం చెప్పారు.
Read also: Samantha : మంకీతో సెల్ఫీ దిగుతున్న సమంత..
హైదరాబాద్‌లో వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయని, దీంతో హుస్సేన్ సాగర్‌కు వరద పోటెత్తుతున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. వర్షాకాలం రాకముందే కాల్వలు పూడికతో నిండిపోయాయని అన్నారు. చెరువుల్లో నీటి మట్టం తక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నట్లు వెల్లడించారు. నగరంలో ఎస్‌ఆర్‌డిపి అమలుకు ముందు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందన్నారు. విపక్షాలు వీలైతే సహాయక చర్యల్లో పాల్గొనాలని మంత్రి కేటీఆర్ సూచించారు. వర్షాలపై రాజకీయం చేయడం సరికాదన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో 14 వంతెనలు మంజూరయ్యాయని కేటీఆర్ తెలిపారు.
Moranchapally: మోరంచపల్లికి రెండు ఆర్మీ హెలికాప్టర్లు.. రంగంలోకి ఎన్‌డీఆర్ఎఫ్ బృందం