Site icon NTV Telugu

KTR: పార్లమెంట్‌ కి అంబేద్కర్ పేరుపెట్టాలి.. కేంద్రానికి కేటీఆర్‌ డిమాండ్‌

Ktr

Ktr

KTR: పార్లమెంట్‌ కి కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ఐటి మినిస్టర్ కేటిఆర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని పంజాగుట్ట చౌరస్తాలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని మంత్రి కేటీఆర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పంజాగుట్ట కూడలి జై భీం, జై కేసీఆర్ నినాదాలతో మారుమోగాయి. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. అంబేద్కర్ లేకపోతే తెలంగాణ లేదన్నారు. సచివాలయానికి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పేరు పెట్టడం ఒక విప్లవాత్మకమని అన్నారు. ఇది దమ్మున్న నాయకుడు కేసీఆర్ వల్ల సాధ్యమైందని మంత్రి తెలిపారు. కేసీఆర్ అమ‌లు చేస్తున్న ద‌ళిత‌బంధు.. సాహ‌సోపేత‌మైన ప‌థ‌కం అని పేర్కొన్నారు.

Read also: Etala Rajender: నా వల్లే దళిత అధికారి నియామకం

సెక్రటేరియ‌ట్‌కు అంబేద్కర్ పేరు పెట్టడం కేసీఆర్‌కే సాధ్యమైంద‌న్నారు. పంజాగుట్ట కూడ‌లికి అంబేద్కర్ పేరు పెడుతామ‌ని కేటీఆర్ ప్రక‌టించారు. కొత్త పార్లమెంట్‌ కి కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మంత్రి కేటీఆర్‌. భారతదేశంలోనే మొట్ట మొదటిసారిగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించబోతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే దానం నాగేందర్, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Read also: Cradle Ceremony For Calf: ఏపీలో పెయ్య దూడకు ఉయ్యాల వేడుక..

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నేడు సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. భారత రాజ్యాంగ నిర్మాతకు నివాళులర్పించేందుకు హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపించనున్నారు. గులాబీలు, పువ్వులు తమలపాకులతో అల్లిన భారీ పూలమాలను రూపొందించారు. 125 అడుగుల విగ్రహానికి ఉన్న భారీ కర్టెన్‌ను తొలగించి నిలువుగా అలంకరించేందుకు భారీ క్రేన్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బౌద్ధ సన్యాసులను మాత్రమే ఆహ్వానించారు. వారి సాంప్రదాయ పద్ధతిలో జరుగనుంది. అంబేద్కర్ మనుమడు ప్రకాష్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. మహారాష్ట్రకు చెందిన అంబేద్కర్ విగ్రహ రూపశిల్పి రామ్ వంజీ సుతార్‌ను రాష్ట్ర ప్రభుత్వం తరపున ఘనంగా సన్మానించనున్నారు. సచివాలయ సిబ్బంది, అధికారులు, అన్ని శాఖల హెచ్‌ఓడీలు, జిల్లా కలెక్టర్లు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు.
Icecream: హైదరాబాద్‌ లో కల్తీ ఐస్ క్రీమ్ తయారీ.. నకిలీ స్టిక్కర్లతో విక్రయాలు

Exit mobile version