టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే.తారకరామారావు మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. టిఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగంతో పాటు పార్టీ కోసం సుదీర్ఘకాలం పనిచేసిన నల్గొండ జిల్లా చండూరు మండలానికి చెందిన దివంగత తిరుమణి కొండల్ ఏడాది క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించారు. కాగా, ఈరోజు కొండల్ కుటుంబం తమకు సహాయం అందించాల్సిందిగా మంత్రి కేటీఆర్ ను తెలంగాణ భవన్ లో కలిశారు. తన భర్త కొండల్ 2001 నుంచి పార్టీ కోసం పనిచేశారని, ఆయన మరణంతో తమ కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయిందని తెలిపారు.
ఈ సందర్భంగా కొండల్ భార్య స్వాతిని ఓదార్చిన మంత్రి కేటీఆర్, తగిన సహాయం చేస్తామన్నారు. పార్టీ అధికార ప్రతినిధి కర్నాటి విద్యాసాగర్ ఈ మేరకు తన కార్యాలయంతో ఈ విషయంలో సమన్యాయం చేయాలని ఆదేశించారు. కొండల్ ఇద్దరు పిల్లల విద్యా విషయంలో సంపూర్ణ బాధ్యత తీసుకుంటానని ఈ సందర్భంగా విద్యాసాగర్, మంత్రి కేటీఆర్ కు తెలియజేశారు.