NTV Telugu Site icon

20 లక్షల కోట్ల ప్యాకేజీ ఎవరికి ఇచ్చారు..?

తెలంగాణ శాసన మండలి వేదికగా… కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్‌ విరుచుకుపడ్డారు. కేంద్రం చెప్పిన 20 లక్షల కోట్ల ప్యాకేజ్ ఒక పెద్ద మిధ్య అని…చిన్న మధ్య తరహా పారిశ్రామిక వేత్తలను ఆదుకోవాలని అనేక మార్లు లేఖలు రాసినా.. కేంద్రం పట్టించుకోలేదని మండిపడ్డారు. కరోనా కారణంగా ఎంఎస్‌ఎంఈ లు మూతపడ్డాయన్నారు. కేంద్రం దేశంలోని పారిశ్రామిక వేత్తలను పరిశ్రమలను కాపాడుకోవడానికి రూ. 20 లక్షల కోట్ల స్పెషల్ ప్యాకేజ్ ఇస్తున్నామని ప్రకటించిందని…కానీ ఒక్క రూపాయి ఇవ్వలేదని ఫైర్‌ అయ్యారు. కరోనా నష్టాల నుంచి పరిశ్రమలను కాపాడుకోవడానికి గొప్పలు చెప్పారు కానీ కేంద్రం ఏమి చేయలేదన్నారు. కేంద్రానికి నిర్మాణాత్మక మైన సూచనలు చేశామని.. కానీ ఎంఎస్‌ఎంఈ లకు కేంద్ర ప్రభుత్వం ఏమి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్‌.