NTV Telugu Site icon

Jagadish Reddy: కాంగ్రెస్, బీజేపీలకు 119 స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులే లేరు..!

Minister Jagadesh Reddy

Minister Jagadesh Reddy

Jagadish Reddy: కాంగ్రెస్, బీజేపీలకు 119 స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులే లేరు మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ దెబ్బకు ప్రతిపక్షాలు కకావికలం అయ్యాయని అన్నారు. బీఆర్ఎస్ లో అంసతృప్తి వస్తుందని ఆశపడ్డారని, వారి‌ ఆశలు అడియాశలు అయ్యాయని అన్నారు. కేసీఆర్ నిర్ణయాన్ని టికెట్లు రాని సిట్టింగులతో పాటు అందరూ గౌరవిస్తున్నారని తెలిపారు. 75 ఏళ్లుగా దేశాన్ని, రాష్ట్రాన్ని మోసం చేసింది కాంగ్రెస్, బీజేపీలే అని మండిపడ్డారు. కేసీఆర్ మూడోసారి సీఎం కావాలని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు. కొందరు అభ్యర్థుల కోసం నోటిఫికేషన్లు ఇస్తున్నారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు 119 స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులే లేరని మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read also: Balayya: జై బోలో గణేష్ మహారాజ్ కీ అంటున్న ‘భగవంత్ కేసరి’

బీజేపీ ఉన్న మూడు స్థానాలు నిలబెట్టుకోవడానే అపసోపాలు పడుతోందని కీలక వ్యాఖ్యలు చేశారు. నల్లగొండ జిల్లాలో 12 స్థానాలు గెలిచి కేసీఆర్ చేతిలో పెడతామని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణలో మూడోసారి కూడా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే విజయం సాధిస్తుందన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ ఎస్ అభ్యర్థుల జాబితా అందరి ఆమోదం పొందిందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని, మూడోసారి కేసీఆర్ మళ్లీ సీఎం కావాలన్నదే ప్రజల ఆకాంక్ష అన్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం లేదని.. ప్రతిపక్షాలు చిల్లర ప్రగల్భాలు పలుకుతాయని, వారి వ్యాఖ్యలు అర్థరహితమని మంత్రి అన్నారు. వచ్చే ఎన్నికల కప్ ను గెలిచి కేసీఆర్ కు గిఫ్ట్ ఇస్తానని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.
బిడ్డకు తల్లిపాలు ఎప్పుడు.. ఎలా మాన్పించాలి..?