కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆశీర్వాద యాత్ర అని చెప్పి… ప్రజలను మోసం చేసే యాత్రకు శ్రీకారం చుట్టారు అని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. తెలంగాణ సీఎం పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గాలి మాటలు మాట్లాడుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చామని యాత్రలో చెప్పి ఉంటే బాగుండేది. మోదీ పాలనలో ఈ దేశంకు ఏం చేశారు… 5 కోట్ల మందికి జాబ్ లు ఇస్తామన్నారు …ఏమైనది అని ప్రశ్నించారు. స్కిల్ డెవలప్మెంట్ అని ఉదార గొట్టారు… బీజేపీ పార్టీ శ్రేణులకు అబద్ధాలు చెప్పే స్కిల్ నేర్పారు. నోట్ల రద్దు ఎందుకు అని అంటే…నల్ల ధనము వెనక్కి తీసుకురావడానికి అన్నారు. నల్ల ధనము కాదు…ప్రజల చేతుల్లో ఉన్న తెల్ల డబ్బే పోయింది అని తెలిపారు. తెలంగాణ కడుతున్న పన్నుల నుంచి…మాకు న్యాయంగా ఇవ్వాల్సిన వాటా కూడా ఇవ్వడం లేదు. తెలంగాణ కు ఒక్క రూపాయి అదనంగా ఇచ్చినట్టు కిషన్ రెడ్డి చూపిస్తారా అని అడిగారు. అలాగే బీజేపీ గొప్ప పాలన చేస్తున్న ఒక్క రాష్ట్రం పేరు చెప్పండి అని పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గాలి మాటలు మాట్లాడుతున్నారు…
jagadish reddy