NTV Telugu Site icon

Harish Rao: ప్రీతి కుటుంబ సభ్యులకు హరీశ్‌ పరామర్శ.. దోషులను శిక్షిస్తామ‌ని హామీ

Harish Rao

Harish Rao

Harish Rao: మెడికో ప్రీతి ఘటన తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన విసయం తెలిసిందే.. నాలుగురోజుల నుంచి నిమ్స్‌ లో ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతన్న ప్రీతిని, తల్లిదండ్రులకు పరామర్శించేందుకు పలువురు నేతలు, రాజకీయ నాయకులు వచ్చి ధైర్యం చెబుతున్నారు. ప్రీతి తల్లిదండ్రులను ఓదార్చి ప్రీతికి సరైన వైద్యం అందిచేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని, ప్రీతి ఇలా ఉండడానికి కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తానని హామీ ఇస్తున్నారు. ఈనేపథ్యంలో నిమ్స్ లో చికిత్స పొందుతున్న వైద్య విద్యార్థిని ప్రీతిని శుక్రవారం ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు పరామర్శించారు. రెండు రోజుల జిల్లా ప‌ర్యట‌న ముగించుకొని శుక్రవారం రాత్రి హైద‌రాబాద్ కు వ‌చ్చారు. అనంతరం నేరుగా నిమ్స్‌కు వెళ్లి ప్రీతి ఆరోగ్యంపై స‌మీక్ష నిర్వహించారు. ఆమెకు అందిస్తున్న వైద్యం గురించి, నిమ్స్ ఇంచార్జి డైరెక్టర్, చికిత్స అందిస్తున్న ప్రత్యేక వైద్య బృందాన్ని మంత్రి హరీశ్ రావు అడిగి తెల్సుకున్నారు.

Read also: Astrology: ఫిబ్రవరి 25, శనివారం దినఫలాలు

అత్యుత్తమ వైద్యం అందించాల‌ని, అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని వైద్యుల‌ను ఆదేశించారు. ప్రీతి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఓదార్చి, ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భ‌రోసా ఇచ్చారు. విచారణ పూర్తి నిష్పాక్షికంగా జ‌రుగుతుంద‌ని, దోషులు ఎంత‌టివారైనా క‌ఠినంగా శిక్షిస్తామ‌ని హామీ ఇచ్చారు. ప్రీతి తండ్రి చేతిలో చేయి వేసి సహనం కోల్పోవద్దని ప్రతీకి ఏమీ కాదని, ఓదార్చారు మంత్రి. కుటుంబ సభ్యులను ధైర్యం చేప్పిన అనంతరం నిమ్స్ నుంచి హరీష్ రావు బయలుదేరుతున్న సమయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. హరీశ్‌ రావు కారును ఎస్టీ సంఘం కార్యకర్తలు అడ్డుకున్నారు. హరీశ్‌ రావు డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. ప్రీతి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. నాలుగు రోజులుగా ప్రీతి విషయం తెలిసినా ఏ నాయకుడు రాలేదని, ఇప్పుడు వచ్చి ఏం చేయాలని అంటూ మండిపడ్డారు. దీంతో నిమ్స్‌ ఆసుపత్రి వద్ద బీఎస్పీతో పాటు ఇతర సంఘాల కార్యకర్తలను పోలీసులు అదుపులో తీసుకున్నారు.
Bhakthi Tv Stothraparayanam Live: శనివారం ఈ స్తోత్ర పారాయణం చేస్తే..