Site icon NTV Telugu

ఈటల ఆత్మగౌరవం ను ఢిల్లీలో తాకట్టుపెట్టాడు : హరీష్ రావు

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నికల్లో భాగంగా జమ్మికుంట పట్టణంలో బహిరంగ సభలో మంత్రులు హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ… పేద ప్రజలను కాపడెది ఎవరు కాల్చుక తినేది ఎవరో ప్రజలు గుర్తించాలి. ఈటల రాజేందర్ ఆరు సార్లు ఎమ్మెల్యే గా గెలిచి ఒక్క కుటుంబానికి ఇల్లు కట్టించలేక పోయాడు. ఎన్నికలు ఆయ్యిపోగానే గ్యాస్ సిలిండర్ ధరలు మళ్ళీ పెంచుతారు బీజేపీ వాళ్ళు. బీజేపీ గెలిస్తే పెట్రోల్ ధరలు,గ్యాస్ ధరలు తగ్గిస్తామని ఎక్కడ అన్న చెబుతున్నారా… రాష్ట్ర ప్రభుత్వ పథకాలలో కేంద్రం వాటా ఉంది అని బీజేపీ నాయకులు అవాస్తవాలు చెబుతున్నారు. ఈటల కు ఆత్మగౌరవం లేదు దానిని ఢిల్లీలో ఏనాడో తాకట్టుపెట్టారు అని తెలిపారు. 25,000 వేల మెజార్టీతో గెల్లు శ్రీనివాస్ ఎమ్మెల్యే కాబోతున్నాడు. గెల్లు శ్రీనివాస్ గెలిస్తే జమ్మికుంటలో ఫ్లై ఓవర్ బ్రిడ్జిని తొలగిస్తాం అని అన్నారు.

Exit mobile version