Harish Rao: రేవంత్ మైండ్ ఉండి మాట్లాడుతున్నాడా? మంత్రి హరీష్ రావు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయానికి ఎన్ని గంటల కరెంట్ అవసరమో రేవంత్ తెలియదన్నారు. మూడు గంటల్లో మూడు ఎకరాలు ఎలా పారుతుంది రేవంత్ ? అని ప్రశ్నించారు. రైతుల జీవితాలతో కాంగ్రెస్ అటలడుకోవలని అనుకుంటుందని మండిపడ్డారు. కాంగ్రెస్ ను నమ్మితే మోసపోతామన్నారు. కటక వేస్తే వచ్చే కరెంట్ కావాలా ? కర్ణాటక మాడల్ చీకటి కరెంట్ కావాలా ? అని ప్రశ్నించారు. మాజీ సీఎం కుమార స్వామి కర్ణాటకలో రెండు గంటల కరెంట్ రావడం లేదని అంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ వస్తె కరెంట్ బాధలు…కర్ఫ్యూ బాధలు వస్తాయన్నారు. కర్ణాటక లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధు బంద్ అయ్యిందట అన్నారు.
కేసీఅర్ అంటే నమ్మకం …చెప్పినవి అని అమలు చేశారన్నారు. బండి సఫ్ నడుస్తుంది…ఎందుకు రిస్క్ తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ నాయకులు మూర్ఖులు… రైతులు అంటే గిట్టదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ రైతు అయిన కాంగ్రెస్ ఎందుకు ఓటు వేయాలని ఆలోచించుకోవాలన్నారు. అయిదేళ్లలో ఎస్సీ రిజర్వేషన్ ఎందుకు గుర్తుకు రాలేదు? అని ప్రశ్నించారు. ఇప్పుడు ఓట్లు వచ్చినవి అని బీజేపీ మాట్లాడుతుందని మండిపడ్డారు. ప్రజల విశ్వాసంను బీజేపీ కోల్పోయిందన్నారు. కర్ణాటక ..తెలంగాణ కు మధ్య కృష్ణ నీటి పంపిణీ వివాదం ఉందన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు కర్ణాటకతో కొట్లాడే దమ్ము… ధైర్యం ఉంటుందా ? అని ప్రశ్నించారు. కర్ణాటక కాంగ్రెస్ నేతల చేతుల్లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉన్నారని అన్నారు.
https://www.youtube.com/live/65axdGqFAdU?si=Buo26CvfbQNkX_56
Himaja Arrest: నేను అరెస్టు కాలేదు.. పోలీసులు అందుకే వచ్చారు- వీడియో రిలీజ్ చేసిన హిమజ