Site icon NTV Telugu

Gangula Kamalakar: కాంగ్రెస్, బీజేపీ ముసుగులో ఆంధ్రా వాళ్లు.. ఏపీలో కలపాలని చూస్తున్నరు..!

Gangula Kamalaker

Gangula Kamalaker

Gangula Kamalakar: కర్ణాటకలో పథకాలు అమలు చెయడానికి ఇబ్బందులు పడుతున్నారు, ఇక్కడ ఆరు గ్యారంటీలు ఏం ఇస్తారని మంత్రి గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని పలు గ్రామాల యువతను బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీనే మా‌ భవిష్యత్తు అని ప్రజలు నమ్ముతున్నారని అన్నారు. వ్యవసాయానికి పనికిరాని భూములు ఇప్పుడు కాళేశ్వరం నీటితో కలకలాడుతున్నాయని తెలిపారు. కరువు నుండి‌ అద్భుతమైన పంటలు పండే రోజులు వచ్చాయని తెలిపారు. ఆంద్రా వాళ్ళు కాంగ్రెస్, బీజేపీ ముసుగుతో వచ్చి ఆంధ్రాలొ కలపాలని చూస్తున్నారని మండిపడ్డారు. రేపు అధికారం ఢిల్లీ చేతిలో కాదు, కేసీఆర్ చేతిలో పెట్టాలని కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ యువత భవిష్యత్తు కేసీఆర్ కాపాడుతారని అన్నారు. ముడుసార్లు గెలిపించారు, నాలగవ సారి మరోక అవకాశం ఇవ్వండి‌ ఇంకా అభివృద్ధి చేస్తానని అన్నారు. మానేరు రివర్ ఫ్రంట్ వస్తే ఇంకా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ పాలనలో వలసలు తగ్గిపోయాయని తెలిపారు. ఆంధ్రా ముసుగులో లిడర్లు వస్తున్నారు, నమ్మవద్దంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. యువత భవిష్యత్తు బాగుండాలంటే కేసీఆర్ రావాలని కోరారు. కాంగ్రెస్, బీజేపీ పాలకులు ఆంధ్రాలో కలుపుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ ఇంకా అభివృద్ధి చెందాలంటే మరొక అవకాశం ‌ఇవ్వాలని కోరారు. డబుల్ ఇంజన్ అంటే ముఖ్యమంత్రి కేసీఆర్, కరీంనగర్ లో ఎమ్మెల్యే గంగుల ఉండాలని తెలిపారు. పదమూడు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు.

కేసీఆర్ లేని తెలంగాణని ఊహించుకొనే పరిస్థితి లేదన్నారు.కేసీఆర్ లేని తెలంగాణ ఆంటే నెర్రలు వారిన తెలంగాణ నే అంటూ గంగుల అన్నారు. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్నవారికి ఓటు వేయవద్దన్నారు. భూ ఖబ్జా చేతుల్లోకి, మతతత్వ పార్టీ చేతుల్లోకి అధికారం పోవద్దని తెలిపారు. 18 నుండి అందరం రంగంలోకి దిగుతామన్నారు. ఎన్నికలప్పుడు వచ్చిన వారిని నమ్మవద్దని తెలిపారు. ఈటెల రాజేందర్ భయపడే హుజురాబాద్ లోనూ పొటీ చేస్తాను అంటున్నారని, ఈటెల రాజేందర్ బిజెపి ‌పార్టీలో తన ఆధిపత్యం కొరకే మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ భీపాంలు బీజేపీ ఆపీసులో, కాంగ్రెస్ ఆపిసులో బీజేపి పార్టీ భీపాం‌ తయ్యారు అవుతాయని అన్నారు. హైదరాబాద్ సంపద కొల్లగొట్టడానికే వస్తున్నారని మండిపడ్డారు.

మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కి తెలంగాణ గురించి ఎందుకు? అని ప్రశ్నించారు. అటూ ఇటూ అయితే తెలంగాణ ఎత్తుకుపొవడానికి చూస్తున్నారని అన్నారు. బండి‌సంజయ్ గంజాయి ఆరోపణలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని, గంజాయిని ఎవరైనా ప్రోత్సహిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ గంజాయి రహితంగా గా ఉండాలని సిపి గారికి‌ ఇంతకు ముందే చెప్పామన్నారు. 2019లో మాకు పేపర్ లో యాడ్స్ కు కూడా అవకాశం ఇవ్వలేదని అన్నారు. అప్పుడు‌కూడా సర్వేలు కాంగ్రెస్ కే అన్నారు, మేమే అధికారం లోకి వచ్చామని తెలిపారు. సర్వేలన్నీ మాకే అనుకూలంగా ఉన్నాయని, కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పరిపాలనలో విఫలం అయ్యిందన్నారు. కర్ణాటకలో పథకాలు అమలు చెయడానికి ఇబ్బందులు పడుతున్నారని, ఇక్కడ ఆరు గ్యారంటీలు ఏం ఇస్తారు? అని అన్నారు. బీజేపీ పార్టీకి‌ ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం ‌లేదని, ఈటెల సీఎం ఎలా అవుతాడు? అని ప్రశ్నించారు.
Vyooham Trailer: వర్మ ఎవరినీ వదిలిపెట్టలేదు… అన్ని పుస్తకాలు చదివిన మనిషికి ఆలోచన ఉండదా?

Exit mobile version