Site icon NTV Telugu

బీజేపీ ఎమ్మెల్యే ఈటలకు సవాల్ విసిరిన గంగుల కమలాకర్…

కరీంనగర్ జిల్లా పరిషత్ కార్యాలయం పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు ప్రజా ప్రతినిధులు. ఒక్కసారిగా అందరూ నినాదాలు చేస్తూ పోలింగ్ కేంద్రలోకి రావడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. అధికార పార్టీ నాయకులను కండువాలు ధరించి, సెల్ ఫోన్ లను అనుమతిస్తున్నారంటూ కార్పొరేటర్ కమల్ జిత్ కౌర్ ఆగ్రహం వ్యక్తం చేసి పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. అయితే అనామకులు ఫిర్యాదు చేస్తే మమ్మల్ని అవుతారా అంటూ మంత్రి గంగుల కమలాకర్ అసహనం వ్యక్తం చేసారు.

మంత్రి గంగుల మాట్లాడుతూ… చట్టాలను గౌరవిస్తాం… కండువాలుంటే అనుమతించకండి అన్నారు. అలాగే బీజేపీ ఎమ్మెల్యే రాజేందర్ కు సవాల్ విసిరారు మంత్రి గంగుల. కరీంనగర్ లోని బీజేపీకి ఉన్న 14 ఓట్లు… కనీసం మీ బీజేపీకి పడుతాయా చూసుకోండి అని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శికండి రాజకీయాలు చేశారు. మా పార్టీ ప్రజా ప్రతినిధులు 986 ఓట్లు ఉన్నాయి. ఒక్క ఓటు తగ్గిన బాధ్యత వహిస్తాము. క్రాస్ ఓటింగ్ భ్రమ. క్యాంప్ కాదు… నాయకుల్ని కాపాడుకోవడం నాయకత్వ బాధ్యత అని పేర్కొన్నారు.

Exit mobile version