Site icon NTV Telugu

Errabelli Dayakar Rao: మన రాష్ట్రంలో అమలు అవుతున్న పథకాలు దేశంలో ఎక్కడా లేవు

Yerrabelli Dayaker Rao

Yerrabelli Dayaker Rao

మన రాష్ట్రంలో అమలు అవుతున్న పథకాలు దేశంలో ఎక్కడా లేవని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని వివిధ గ్రామాలలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఆసరా పెన్షన్ కార్డులను పంపిణీ చేసిన ఆయన మాట్లాడుతూ.. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాలలో 500 రూపాయల పెన్షన్ మాత్రమే ఇస్తున్నారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ పథకం ద్వారా 2016 రూపాయల పెన్షన్ అందిస్తున్నారని అన్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ నేతృత్వంలో దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. మన రాష్ట్రంలో అమలు అవుతున్న పథకాలు దేశంలో ఎక్కడా లేవని గుర్తు చేశారు. ఆసరా పెన్షన్లు దాదాపు అర కోటి మందికి ఇస్తున్నామన్నారు. దేశంలో పెన్షన్లు వృద్ధులకు, దివ్యాంగులకు మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. కానీ, మన రాష్ట్రంలో బీడీ కార్మికులకు, వితంతువులకు, హెచ్‌ఐవీ, బోదకాలు బాధితులకు, తాజాగా డయాలిసిస్ పేషెంట్లకు కూడా పెన్షన్లు ఇస్తున్న మహానుభావుడు కేసీఆర్ అని అన్నారు. పెన్షన్ల వయో పరిమితిని 57 ఏండ్ల కు తగ్గించి ఇస్తున్నారని తెలిపారు. మనమంతా సీఎం కేసీఆర్‌ కు రుణపడి ఉండాలని ఎర్రబెల్లి దయాకర్‌ అన్నారు.
Rajnath Singh: కేంద్ర రక్షణ శాఖ మంత్రికి గుర్రాన్ని బహుమతిగా ఇచ్చిన దేశాధ్యక్షుడు

Exit mobile version