నారా లోకేష్ పై మంత్రి అనిల్ కుమార్ ఫైర్ అయ్యారు. కర్నూల్ లో జగన్ గురించి మాట్లాడిన వాళ్ళకు చెబుతున్నా.. గడ్డం పెంచుకుని గట్టిగా మాట్లాడితే అంతకన్నా సౌండ్ వస్తుంది ఇక్కడి నుంచి అని హెచ్చరించారు. దేనికీ భయపడం, ఒంట్లో భయం లేదు, ట్రోల్స్ చేసుకో నీకు ఇష్టం వచ్చినట్లు అని పేర్కొన్నారు. చిటిక వేస్తే వైసిపి నాయకులు ఊర్లో తిరగలేరు అన్నావని.. రాష్ట్రంలో నీకు ఇష్టం వచ్చిన ఊర్లో చిట్టికి వెయ్యి దమ్ముంటే అని సవాల్ విసిరారు. నీకే అంత ఉంటే మాకు ఎంత ఉండాలని.. నువ్వు మగాడివి అయితే చిట్టికి వెయ్యి అని పేర్కొన్నారు. లోకేష్ తండ్రికి పిచ్చి పట్టింది, తండ్రికి మానసిక స్థితి బాలేదు, లోకేష్ నీకు పదవి లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి అనిల్ కుమార్. ఇంకో నెలలో ఎమ్మెల్సీ పదవి పోతుందని… నువ్వు సర్పంచ్, కార్పొరేటర్, జెడ్పిటిసి గా ఎక్కడ కూడా గెలవలేవని ఎద్దేవా చేశారు. మీ నాన్న అధ్యక్ష పదవి ఇచ్చే పరిస్థితి లేదు…రాజ్యసభ పదవి ఇవ్వడు… మీ నాన్న చంద్రబాబు దగ్గరికి వెళ్లి చిటిక వెయ్యి… అంతేగాని జగన్ గురించి మాట్లాడుకు అని లోకేష్ కు చురకలు అంటించారు. ఇంట్లో కూర్చుని ఐదో తరగతి పిల్లవాడు మాట్లాడుతాడని.. దమ్ముంటే బయటికి వచ్చి మాట్లాడు అని ఫైర్ అయ్యారు. ఉంటే పోతారు.. ఉంటే పోతారు.. అంటున్నావు.. ఉన్న ఏమి పీకలేవు అని మండిపడ్డారు.