Site icon NTV Telugu

Hyderabad Party: మితిమీరుతున్న పార్టీలు.. దీనికి ఆర్గ‌నైజర్ మ‌హిళే!

Revparty Vanasthalipuram

Revparty Vanasthalipuram

నగరంలో అమ్మీషియా పబ్ ఘటన తరువాత పోలీసులు అలర్ట్ అయ్యారు. పార్టీలకు, పబ్ లకు సమయం కేటాయించి.. ఆ సమయం కంటే ఎక్కువసేపు పార్టీలు చేసుకుంటున్నవారిపై కేసులు నమోదు చేస్తున్నారు. అయినా నగరంలో పార్టీలతో యువత హద్దుమీరి ప్రవర్తించడం చర్చకు దారితీస్తోంది. అధికారులు ఎన్ని పకడ్బందీ చర్యలు చేపట్టిన సమయం సందర్భంలేకుండా పార్టీల పేరుతో తమ జీవితాలను నాసనం చేసుకుంటుంది. ఇలాంటి ఘటన అబ్దుల్లా పూర్ మెట్టు పోలీస్ స్టేషన్ పరిధిలోని లష్కర్‌గూడ సమీపంలోని ఒక ఫామ్ హౌజ్‌లో చోటుచేసుకుంది.

నిన్న (ఆదివారం) అర్ధరాత్రి అబ్దుల్లా పూర్ మెట్టు పోలీస్ స్టేషన్ పరిధిలోని లష్కర్‌గూడలో ఒక ఫామ్ హౌజ్‌లో పార్టీ జరుగుతుందని విశ్వనీయ సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు.సుమారు 12 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అదుపులో తీసుకున్న వారిలో ఆరుగురు అమ్మాయిలు కూడా ఉన్నట్లు సమాచారం. కాగా.. ఘటనా స్థలంలో హుక్కా పాట్‌లు లభ్యమయ్యాయి. పార్టీ లో పాల్గొన్న అమ్మాయిలు, అబ్బాయిల తల్లితండ్రులకు పోలీస్ లు కౌన్సిలింగ్ ఇస్తామని తెలిపారు. అయితే.. ఈ పార్టీని వనస్థలిపురానికి చెందిన ఒక మహిళ ఆర్గనైజ్ చేస్తున్నట్లు సమాచారం.

Maharashtra Political Crisis: సంజయ్‌ రౌత్‌ సంచలన వ్యాఖ్యలు..

Exit mobile version