Site icon NTV Telugu

Arutla Hills Venture: ఉక్కా, మద్యం సేవించి యువత హంగామా.. తలపట్టుకుంటున్న గ్రామస్తులు

Arutla Hills Venture

Arutla Hills Venture

Arutla Hills Venture: రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామంలోని ఆరుట్ల హిల్స్ వెంచర్ లోని విల్లాస్ లో అర్ధరాత్రి అమ్మాయిల అబ్బాయిల హంగామా సృష్టించారు. అక్కడ సిమ్మింగ్ చేస్తూ ఉక్కా, మద్యం సేవించి ఆట, పాటలతో హోరెత్తించారు. వారి అరుపులకు గ్రామస్తులు తలపట్టుకుంటున్నారు. ఇక్కడికి ఎవరు ఎప్పుడు వస్తారో తెలియడం లేదని, అందరిని అనుమతిస్తున్నారని ఆగోళను భరించలేకపోతున్నామని అంటున్నారు. మద్యం, హక్కు సేవించి అమ్మాయిలు, అబ్బాయిలు మత్తులో తూగుతూ డ్యాన్సులు చేస్తున్నారని, ఆ సౌండ్‌లు భరించలేక పోతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతూనే ఉంటాయని కానీ, పట్టించుకునే నాధుడు కరువయ్యారని చెబుతున్నారు. రాత్రి ఈగోళకు ఇళ్లల్లో వుండలేకపోతున్నామని, మా పిల్లలు కూడా ఇటువంటి వాటికి అలవాటు పడతారేమో అనేభయంతో గడుపుతున్నామని తెలిపారు. ఇక్కడ అడవి ప్రాంతంలో గెస్ట్ హౌస్ లు కట్టి నగరంలో ఉన్న విద్యార్థులకు జల్సా రాయలకు రెంట్లు ఇవ్వడం జరుగుతుందని విమర్శించారు.

ఇక్కడికి రాత్రి సమయంలో ఎవరు వస్తారో తెలియదు, ఎవరు పోతారు కూడా తెలవదని గ్రామస్తులు వాబోతున్నారు. రాత్రి మూడు గంటల సమయంలో తాగి అరుపులు డాన్సులు చేస్తూన్నారని. ఇలాంటి సంఘటన జరగకుండా పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇక్కడికి నిన్న 12 మంది అబ్బాయిలు, నలుగురు అమ్మాయిలు వున్నారని వారందరూ.. నగరంలోని ఎం.వి.ఎస్.ఆర్ కాలేజ్ చెందిన విద్యార్థులు అని తెలిపారు. ఒక అబ్బాయిది పుట్టినరోజు ఉండడం ద్వారా ఇక్కడికి వచ్చి పార్టీ చేసుకుంటున్నారని పోలీసులు తెలిపారు. వారందరికి వార్నింగ్ ఇచ్చామని అన్నారు. ఇబ్రహీంపట్నం పోలీసులు మాట్లాడుతూ.. అరుట్ల హిల్స్ ఘటన పై ఎలాంటి కేసు నమోదు చేయలేదని తెలిపారు. Mvsr కాలేజ్ యువత బర్త్ డే చేసుకున్నారని, అసభ్యకరమైన కార్యకలాపాలు, హుక్కా సేవించిన ఆధారాలు లేవని అన్నారు. రిసార్ట్ కి అనుమతుల పై ఎంక్విరీ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

పబ్బుల్లో రాత్రి 10 గంటల తరువాత నో సౌండ్‌ అంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. గత కొద్దిరోజులుగా పబ్‌లో జరుగుతున్న ఘటనల దృష్యా హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. జూన్‌ లో అమ్నిసియా పబ్ ఘటన సంచలనంగా మారడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు పబ్‌ లను మైనర్లను పబ్‌లలోకి అనుమతించరాదని, పబ్‌ లు 10 గంటల తరువాత నడపకూడదని ఆర్డర్‌ వేసింది. పబ్బులపై ప్రజల నుండి కొన్ని ఫిర్యాదులు వచ్చినందుకే ఈ సమీక్ష నిర్వహించడం జరిగిందని.. నివాసితులకు అసౌకర్యం కలిగించొద్దని చెప్పారు. రాత్రి 10 గంటల తరువాత పబ్‌లు సౌండ్‌ బంద్‌ కావడంతో.. యువత వాలర్‌ ఫాల్స్, నగర సివార్లలో ఎంజాయ్‌ చేసేందుకు ఇంట్రెస్ట్‌ చూపుతున్నారు.
Whatsapp: వాట్సాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్.. జూమ్‌, గూగుల్‌ మీట్‌లా…!

Exit mobile version