Site icon NTV Telugu

Michaung Rain Alert: తెలంగాణపై మిచౌంగ్‌ ప్రభావం.. జిల్లా కలెక్టర్లతో రాహుల్ బొజ్జా టెలీ కాన్ఫరెన్స్

Michaung Rain Alert

Michaung Rain Alert

Michaung Rain Alert: బంగాళా ఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాన్ మిచౌంగ్ ప్రభావంతో ఉత్తర, దక్షణ తెలంగాణా జిల్లాలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. భద్రార్డీ కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, హన్మకొండ, వరంగల్, జనగాం, మహబూబ్ బాద్, సూర్యాపేట తదితర జిల్లాల కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఇవాళ, రేపు రెండురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాలు, వరదలు వచ్చిన సందర్భంలో పాటించాల్సిన ప్రొటొకాల్స్ కు అనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు.

Read also: NTR: ఒకటి రెండు మూడు… దేవర వస్తున్నాడు…

భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలలు ఒక్కొక్క ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే పూర్తిగా నిండిన చెరువులకు గండ్లు పడకుండా చర్యలు చేపట్టాలన్నారు. నీటిపారుదల శాఖ, విప్పటూల నిర్వహణ శాఖ, రోడ్లు భవనాల శాఖ, పంచాయితీ రాజ్, రెవిన్యూ శాఖ లు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రధానంగా వరదలు వచ్చే అవకాశం ఉన్నందున కాజ్-వె, లోతట్టు ప్రాంతాల వద్ద తగు జాగ్రత చర్యలు చేపట్టాలని హెచ్చరికలు జారీ చేశారు. అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా పునరావాస కేంద్రాలను ముందుగానే గుర్తించాలని అన్నారు.
NTR: ఒకటి రెండు మూడు… దేవర వస్తున్నాడు…

Exit mobile version