Site icon NTV Telugu

Medchal Accident: బైక్ ను ఢీ కొట్టిన కారు.. తండ్రి మృతి.. కూతురికి గాయాలు..

Medchel Accident

Medchel Accident

Medchal Accident: బైక్ పై వెళ్తున్న ఇద్దరిలో తండ్రి మృతి చెందగా కూతురికి తీవ్ర గాయాలు అయిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బైక్ పై రోడ్డు దాటుతుండగా వేగంగా దూసుకొచ్చిన కారు ఢీ కొట్టింది. దీంతో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరిలో తండ్రి మృతి చెందగా కూతురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ ఫుటేజీలో నమోదయ్యాయి. బీహార్ కు చెందిన పంకజ్ రామ్, ఆయన కుమార్తె పూజ కుమారి కలిసి బైక్ పై తుర్కపల్లి నుంచి యాడారం వెళ్లేందుకు మురహరి పల్లి చౌరస్తా వద్ద రాగానే.. రాజీవ్ రహదారి రోడ్డు దాటుతున్నారు.

Read also: Ganja Seized: పుష్ప సినిమాకు మించి స్మగ్లింగ్ కు ప్లాన్.. ఏపీకి చెందిన వ్యక్తి అరెస్ట్..

అయితే అదే సమయంలో హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న కారు వేగంగా దూసుకువచ్చింది. బైక్ ను అతివేగంగా ఢీ కొట్టింది. దీంతో బైక్ పై వెళుతున్న తండ్రి కూతురు ఒక్కసారిగా ఎగిరి పడ్డారు. ఈ ప్రమాదంలో తండ్రి పంకజ్ అక్కడికక్కడే మృతి చెందగా.. కూతురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు పోలీసులుకు సమాచారం అందించడంతో హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతి చెందిన పంకజ్ ను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించగా.. పూజను ఆర్వీఎం ఆపుపత్రికి తరలించారు. కారు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Burkina Faso: బుర్కినా ఫాసోలో మళ్లీ చెలరేగిన హింస.. జిహాదీల ఊచకోతలో 200 మంది మృతి..!

Exit mobile version