NTV Telugu Site icon

Medaram Bus Tickets: మేడారం జాతరకు బస్ ఛార్జీలు ఖరారు.. ఎంతో తెలుసా?

Medaram

Medaram

Medaram Bus Tickets: ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభం కానున్న మేడారం మహాజాతరలో వనదేవతలను దర్శించుకునేందుకు దాదాపు లక్షన్నర మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం రూ.105 కోట్లతో జాతర ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి మేడారం భక్తులను తీసుకొచ్చేందుకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీఎస్‌ఆర్టీసీ 51 కేంద్రాల నుంచి ఏకకాలంలో ఆరు వేలకు పైగా బస్సులను నడిపేందుకు కసరత్తు చేస్తోంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇప్పటికే మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించామని, గత జాతరలతో పోలిస్తే ఈ ఏడాది ఆర్టీసీ బస్సుల్లో వచ్చే భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మహాలక్ష్మి పథకం అమలు నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నడిచే ఆరు వేలకు పైగా ఆర్టీసీ బస్సుల్లో సుమారు 40 లక్షల మంది ప్రయాణించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ప్రయాణించే భక్తులకు ఆర్టీసీ ఛార్జీలను కూడా టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది.

Read also: Medaram Jatara 2024: నేటి నుంచి మేడారం జాతరలో ప్రత్యేక పూజలు

18 నుంచి బస్సులు ప్రారంభమవుతాయి

టీఎస్‌ఆర్టీసీ రాష్ట్రవ్యాప్తంగా 6వేలకు పైగా బస్సులను నడిపే అవకాశం ఉండగా, ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి దాదాపు 2,500 బస్సులు నడపడానికి అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 10 నుంచి 15 లక్షల మంది భక్తులు ఆర్టీసీ సేవలను వినియోగించుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 22 ప్రాంతాల నుంచి బస్సులు నడిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ చెల్లించిన వారి కోసం ప్రత్యేక మేడారం బస్సులు నడుపుతున్నారు. ఈ నెల 21 నుంచి 24 వరకు మహాజాతర జరగనుండగా.. ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ఈ నెల 18 నుంచి 25 వరకు 6 వేల బస్సులు నడపనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

మహిళలకు ఉచితం.. ఇతర ఛార్జీలు ఇలా..

రాష్ట్రవ్యాప్తంగా 51 కేంద్రాల నుంచి మేడారం ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ఇందులో ఒక్క వరంగల్ లోనే 22 కేంద్రాలు ఉండగా.. వరంగల్ నగరంలోని మూడు ప్రాంతాల నుంచి బస్సులు నడపనున్నారు. ఈ మేరకు మేడారం జాతరకు వెళ్లే ఛార్జీలను కూడా ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. మహాలక్ష్మి పథకం ప్రకారం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు. ఆర్టీసీ అధికారులు పురుషులకు చార్జీలను విడుదల చేశారు. అధికారులు విడుదల చేసిన వివరాల ప్రకారం బస్సు నిర్వహణ కేంద్రం, కిలోమీటర్లు, పెద్దలు, పిల్లలకు చార్జీలు ఇలా ఉన్నాయి.

Read also: Today Gold Price: తగ్గుముఖం పడుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్స్ ఇవే!

చార్జీలు ఇలా..

1. హనుమకొండ నుండి మేడారం జాతరకు బస్సు ఛార్జీ 110 కి.మీ. బస్సు ఛార్జీలు పెద్దలకు 250, పిల్లలకు 140గా నిర్ణయించారు.

2. మేడారం జాతర కాజీపేట నుండి 110 కి.మీ.. పెద్దల ఛార్జీలు: 250, పిల్లల ఛార్జీలు: 140

3. వరంగల్ నుండి మేడారం జాతర 110 కి.మీ.. పెద్దల ఛార్జీ: 250, పిల్లల ఛార్జీ: 140

4. జనగామ నుండి మేడారం జాతరకు 165 కి.మీ.. పెద్దల ఛార్జీలు: 370, పిల్లల ఛార్జీలు: 210

5. హైదరాబాద్ నుండి మేడారం 259 కి.మీ.. పెద్దల ఛార్జీ: 550, పిల్లల ఛార్జీ: 310

6. హైదరాబాద్‌లోని ఇతర ప్రాంతాల నుండి మేడారం 274 కి.మీ.. పెద్దల ఛార్జీ: 600, పిల్లల ఛార్జీ: 320

7. స్టేషన్ ఘన్‌పూర్ నుండి మేడారం జాతర వరకు 140 కి.మీ.. పెద్దల ఛార్జీలు: 300, పిల్లల ఛార్జీలు: 180

8. మేడారం జాతర నర్సంపేట నుండి 107 కిలోమీటర్లు..పెద్దల ఛార్జీలు: 250, పిల్లల ఛార్జీలు: 150

9. కొత్తగూడ నుండి మేడారం జాతర 137 కి.మీ.. పెద్దల ఛార్జీలు: 300, పిల్లల ఛార్జీలు: 170

10. పరకాల నుండి మేడారం జాతరకు 107 కి.మీ.. పెద్దల ఛార్జీలు: 250, పిల్లల ఛార్జీలు: 140

11. చిట్యాల నుండి మేడారం జాతరకు 115 కి.మీ.. పెద్దల ఛార్జీలు: 250, పిల్లలకు ఛార్జీలు: 140

12. మహబూబాబాద్ నుండి మేడారం జాతర 155 కి.మీ.. పెద్దల ఛార్జీలు: 350, పిల్లల ఛార్జీలు: 190

13. గూడూరు నుండి మేడారం జాతర 125 కి.మీ.. పెద్దల ఛార్జీలు: 280, పిల్లల ఛార్జీలు: 160

14. తొర్రూర్ నుండి మేడారం జాతర 165 కి.మీ.. పెద్దల ఛార్జీ: 350, పిల్లల ఛార్జీ: 190

15. వర్ధన్నపేట నుండి మేడారం జాతరకు 133 కి.మీ.. పెద్దల ఛార్జీలు: 300, పిల్లలకు ఛార్జీలు: 160

16. మేడారం జాతర ఆత్మకూరు నుండి 90 కిలోమీటర్లు..పెద్దల ఛార్జీలు: 210, పిల్లల ఛార్జీలు: 120

17. మల్లంపల్లి నుండి మేడారం జాతరకు 75 కి.మీ.. పెద్దల ఛార్జీలు: 180, పిల్లల ఛార్జీలు: 110

18. మేడారం జాతర ములుగు నుండి 60 కి.మీ.. పెద్దల ఛార్జీలు: 150, పిల్లల ఛార్జీలు: 90

19. మేడారం జాతర భూపాలపల్లి నుండి 100 కి.మీ.. పెద్దల ఛార్జీలు: 220, పిల్లల ఛార్జీలు: 130

20. మేడారం జాతర ములుగు గణపురం నుండి 80 కిలోమీటర్లు..పెద్దల ఛార్జీలు: 200, పిల్లల ఛార్జీలు: 110

21. మేడారం జాతర జంగాలపల్లి నుండి 55 కి.మీ.. పెద్దల ఛార్జీలు: 150, పిల్లల ఛార్జీలు: 90

22. పస్రా నుండి మేడారం జాతర వరకు 30 కి.మీ..పెద్దల ఛార్జీలు: 80, పిల్లల ఛార్జీలు: 50

23. మేడారం జాతర గోవిందరావుపేట నుండి 35 కిలోమీటర్లు..పెద్దల ఛార్జీలు: 100, పిల్లల ఛార్జీలు: 60

24. తాడ్వాయి నుండి మేడారం జాతరకు 16 కి.మీ.. పెద్దల ఛార్జీలు: 60, పిల్లల ఛార్జీలు: 40
Gold : మనోళ్లకు పిచ్చి.. ఒక్క నెలలోనే రూ.657 కోట్ల బంగారం కొన్నారు