NTV Telugu Site icon

Medak: డ్వాక్రా డబ్బుతో మహిళ పరార్.. రుణాలు చెల్లించాలని బాధితులకు బ్యాంకు నోటీసులు

Medak

Medak

Medak: మెదక్‌ జిల్లా నిజాంపేటలో మహిళా సంఘాలు ఆందోళన చేపట్టారు. రుణాలు చెల్లించాలని బ్యాంకుల నుంచి నోటీసులు రావడంతో మహిళలు షాక్‌ తిన్నారు. ప్రవీణ అనే మహిళ డ్వాక్రా డబ్బుతో పరార్‌ అయ్యిందని గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశామని అన్నారు. ఇప్పుడు డబ్బులు చెల్లించమంటే ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలని వాపోతున్నారు. మా డ్వాక్రా డబ్బులతో పరార్‌ అయ్యిన ప్రవీణ ఇప్పటి వరకు జాడ లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Read also: Tragedy: విషాదం.. పంటకాలువలోకి దూసుకెళ్లిన కారు, ముగ్గురు గల్లంతు

ప్రవీణ ఫోన్‌ అప్పటి నుంచి స్వీచ్‌ ఆఫ్‌ వస్తుందని, నమ్మి మోసపోయామని అన్నారు. ఇప్పుడు మాకు రావాల్సిన డబ్బులు ప్రవీణ తీసుకుని పరారీలో ఉందని వాపోయారు. రోజూ కూలీతో కుటుంబం గడుస్తుందని ఆ డబ్బులు మమ్మల్ని కట్టమంటే ఎక్కడి నుంచి కడతామని అన్నారు. పోలీసులు నిందితురాలిని పట్టుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం దీనిపై స్పందించి బ్యాంక్‌ సిబ్బందితో చర్చలు జరపాలని కోరుతున్నారు.
India- Bangladesh: భారత్తో సంబంధాలు బలంగానే ఉన్నాయి.. హసీనా వ్యాఖ్యలపై యూనస్ ఆందోళన