Raghunandan Rao: మెదక్ లోని రామాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ క్రమంలో హిందూ సంఘాలు, అఖిలపక్ష నాయకులు రామాలయం వద్దకు భారీగా వచ్చారు. దేవాదాయ శాఖ పరిధిలోకి ఆలయాన్ని తీసుకునేందుకు అధికారుల ప్రయత్నం చేశారు. అధికారులను అఖిలపక్ష నాయకులు, హిందుసంఘాలు అడ్డుకున్నాయి. దీంతో అధికారులు, పోలీసులు అఖిలపక్ష నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. ఇక, ధర్నా చేస్తున్న మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేవాదాయ శాఖ పరిధిలోకి ఆలయాన్ని తీసుకోవద్దంటూ ఆందోళన చేశారు.
Read Also: Celebrity Divorce: విడాకులపై షాకింగ్ రీజన్ చెప్పిన ప్రముఖ నటి.. మంచి మూడ్‌లో ఉంటే నిద్రపోతాడు..!
ఇక, మెదక్ లో వివాదానికి కారణమైన రామాలయాన్ని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెదక్ రామలయాన్ని ఎండోమెంట్ లోకి ఎలా తీసుకుంటారు అని ప్రశ్నించారు. తెలంగాణలో ధూప దీప నైవేథ్యాలకు నోచుకోని ఎన్నో గుళ్లు ఉన్నాయి.. వాటిని తమ అధీనంలోకి తీసుకుని బాగు చేయాలని కోరారు. గతంలో హిందువులను టెర్రరిస్టులుగా అప్పట్లో యూపీఏ సర్కార్ చూపించింది అని ఆరోపించారు. పాకిస్థాన్ ఏజెంట్ లుగా యూపీఏ నేతలు మారారు.. హిందువుల్లో ఐక్యత తక్కువగా ఉంటుందనే అధికారంలో ఉండే పార్టీలు ఇలా చేస్తున్నాయని పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్ లో ఆర్మీ సైనికులు తమ ప్రాణాలకు తెగించి పని చేస్తారు అని ఎంపీ రఘునందన్ రావు తెలిపారు.
