NTV Telugu Site icon

Medak Incident: నర్సాపూర్ పోలీసుల నిర్వాకం.. ఆరేళ్ళ క్రితం చనిపోయిన వ్యక్తిపై ఎఫ్ఐఆర్

Medak Incident

Medak Incident

Medak Incident: ఆరేళ్ళ క్రితం చనిపోయిన వ్యక్తిపై ఎఫ్ఐఆర్ చేసిన ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ లో సంచలనంగా మారింది. రెండు నెలల క్రితం భూ వివాదంలో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ లో నలుగురు పేర్లు నమోదు చేశారు. అయితే ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న నలుగురి పేర్లలో విట్ఠల్ అనే వ్యక్తం ఆరేళ్ళ క్రితమే మృతి చెందాడు. కనీసం విచారణకు చేయకుండా నర్సాపూర్ పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేశారు. దర్యాప్తు చేయకుండా ఏకపక్షంగా నర్సాపూర్ పోలీసులు వ్యవహరిస్తున్నారని మృతుడి కుటుంబ సభ్యుల ఆరోపించారు. దీంతో ఈ విషయం బయటకు రావడంతో నర్సాపూర్ పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై విట్టల్ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ..ఆరేళ్ళ క్రితం చనిపోయిన వ్యక్తిపై సమాచారం లేకుండా ఎలా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారని మండిపడుతున్నారు. రెండు నెలల క్రితం జరిగిన భూ వివాదంలో ఆరేళ్ళ క్రితం చనిపోయిన వ్యక్తి పేరు ఎలా వచ్చింది? అని ప్రశ్నించారు. నర్సాపూర్ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఎఫ్ఐఆర్ లో విట్టల్ పేరు తొలగించాలని కోరుతున్నారు. మరి ఈ ఘటనపై నర్సాపూర్ పోలీసులు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం.
Patnam Narender Reddy: బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే పట్నం నరేంద్‌రెడ్డికి హైకోర్టులో ఊరట..

Show comments