NTV Telugu Site icon

Medak: బాలికల పాఠశాలలో ఎలుకలు స్త్వైర విహారం.. పట్టించుకోని అధికారులు

Medak School

Medak School

Medak: మెదక్ జిల్లా రామాయంపేటలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో ఎలుకల స్వైర విహారం చేస్తున్నాయి. 9వ తరగతి చదువుతున్న 12 మంది విద్యార్థినిలను ఎలుకలు కరవడంతో తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. ఎలుకలు కరిచాయంటూ యాజమాన్యానికి తెలిపిన సాయంత్రం వరకు ఎవరూ స్పందించలేదని విద్యార్థినిలు తెలిపారు. సాయంత్రం ఆసుపత్రికి తరలించారని తెలిపారు. పిల్లలపై ఎలుకలు దాడి చేసాయనే సమాచారంతో తల్లిదండ్రలు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. పాఠశాల యాజమాన్యానికి ప్రశ్నించారు. అయినా ఎవరు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల ఆవరణలో కుక్కలు కూడా స్వైర విహారం చేస్తున్నాయని అన్నారు. బాలికల పాఠశాలలో ఎక్కడి పడితే అక్కడ చెత్త పేరుకుపోయిందని మండిపడ్డారు.

Read also: Indian 2 : ఇండియన్ 2 సినిమా చివర్లో డైరెక్టర్ శంకర్ సర్ప్రైజ్ ఇవ్వనున్నాడా..?

బాత్ రూమ్ లు, కళాశాలలో కూడా అపరిశుభ్రంగా వుందని తెలిపారు. కళాశాలలో కూర్చున్న చోటు కూడా ప్రమాదం మారుతుందని అన్నారు. ఎలుకలు 12 మంది విద్యార్థినిలకు కవడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం ఈ ఘటన జరిగినా యాజమాన్యం సాయంత్రం స్పందించిందని వాపోయారు. ఇలాగే ఉంటే పిల్లలు అనారోగ్య బారిన పడే అవకాశం ఉందని తెలిపారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుతున్నారు. ఇలాంటి వాటిపై ఆరోగ్య శాఖ మంత్రి వెంటనే స్పందించి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలుపుతున్నారు.
Indian 2 : ఇండియన్ 2 సినిమా చివర్లో డైరెక్టర్ శంకర్ సర్ప్రైజ్ ఇవ్వనున్నాడా..?