Medak Tragedy: మెదక్ జిల్లాలోని శివ్వంపేట మండలంలోని శభాష్ పల్లిలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని రెండేళ్ల కూతురిని కసాయి తల్లి, ప్రియుడు హత్య చేశారు. అయితే, మమతకు ఐదేళ్ల క్రితం సిద్దిపేట జిల్లా రాయపోల్ గ్రామానికి చెందిన భాస్కర్ తో పెళ్లైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇక, ఈ ఏడాది మార్చిలో భర్తతో గొడవ పెట్టుకుని ఇద్దరు పిలల్లతో కలిసి పుట్టింటికి వచ్చిన మమత.. అదే గ్రామానికి చెందిన ఫయాజ్ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
Read Also: Viral Video: అక్కడ కప్ప పకోడీలు చాలా ఫేమస్.. లొట్టలేసుకుంటూ తింటున్న జనాలు!
అయితే, తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని ఈ ఏడాది జూన్ 7వ తేదీన చిన్నారీ తను శ్రీని తల్లి మమత, ప్రియుడు ఫయాజ్ హత్య చేశారు. కూతురు మమత, మనవరాలు తను శ్రీ కనిపించడం లేదంటూ శివంపేట పోలీసులకు తండ్రి రాజు ఫిర్యాదు చేశారు. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఏపీలోని గుంటూరు జిల్లా నరసరావుపేటలో మమత, ఫయాజ్ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కాగా, నరసరావుపేటలో ఇద్దరిని అదుపులోకి తీసుకుని చిన్నారి కోసం విచారించగా అసలు విషయం బయటపడింది. ఇక, శభాష్ పల్లి శివారులో తను శ్రీ మృతదేహాన్ని పూడ్చిపెట్టామని చెప్పడంతో జేసీబీతో తవ్వగా.. కుళ్ళిన స్థితిలో చిన్నారి మృతదేహం లభ్యమైంది. దీంతో ఆ కసాయి తల్లి మమతతో పాటు ప్రియుడు ఫయాజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
