మెదక్‌లో మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాజకీయాలు శాశ్వతం కాదు… ప్రజలకు వైద్యం, విద్య, సంక్షేమం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయి.. అయినా పట్టుదలతో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో 8 మెడికల్ కళాశాలలు రావాలని ఎంతో శ్రమించామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. హెల్త్ మినిస్టర్‌గా తనపై పెద్ద బాధ్యత ఉందన్నారు. 90 శాతం వైద్య సదుపాయాలు హైదరాబాద్‌కు వెళ్లకుండా స్థానికంగా జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి పేర్కొన్నారు.
Read Also: Amaravati Railway Line: అమరావతి రైల్వేలైన్‌కు కేంద్ర కేబినెట్ గ్రీన్‌సిగ్నల్
మరోవైపు.. మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. ప్రధానిగా మోడీ 327 కొత్త మెడికల్ కళాశాలలు ఇచ్చారని తెలిపారు. వైద్య, విద్యకు మోడీ ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారు.. తెలంగాణకు ప్రతిష్టాత్మక ఎయిమ్స్ ఇచ్చింది మోడీనే అని అన్నారు. పేదలకు ఉచిత వైద్యం అందించాలన్నదే మోడీ సర్కార్ లక్ష్యమని ఎంపీ రఘునందన్ రావు చెప్పారు.
Read Also: Delhi: జమ్మూకాశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా! కేంద్రం సానుకూల సంకేతాలు