CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి మెదక్ పర్యటనలో భాగంగా ముందుగా ఏడుపాయల అమ్మావారి ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం అక్కడి నుంచి మెదక్ క్యాథెడ్రల్ చర్చికి చేరుకున్నారు. చర్చికి చేరుకున్న అనంతరం పాస్టర్లు సీఎం రేవంత్ రెడ్డికి మెదక్ చర్చి నమూనాను జ్ఞాపికగా అందజేశారు. అనంతరం సీఎం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. చర్చిలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. మెదక్ చర్చి వందేళ్ల వేడుక జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. క్రైస్తవ సోదరులకు పేరు పేరున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
Read also: BJP MP Laxman: అలవికాని హామీలు అమలు చేయలేక డ్రామాలు.. లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు..
మా ప్రజా ప్రభుత్వాన్ని దీవించాలని సీఎం కోరారు. పేదల ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు న్యాయం జరుగుతుందన్నారు. ఇందిరమ్మ ఇళ్లలో ఎక్కువగా దళిత, గిరిజన క్రైస్తవులకు లబ్ది చేకూరుతుందని తెలిపారు. పంట బోనస్ కూడా కర్షకులకు మా ప్రభుత్వం ఇస్తోందన్నారు. రూ.21 వేల కోట్లు రుణమాఫీ చేసి పేద రైతులకు భరోసా ఇచ్చామన్నారు. మా ప్రభుత్వం పది కాలాల పాటు వర్ధిల్లాలని అన్నారు. మెదక్ జిల్లా అభివృద్ధి విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని సీఎం తెలిపారు. ఏ అవసరం ఉన్న మంత్రులు దామోదర, కొండా సురేఖ దృష్టికి తీసుకురావాలని కోరారు. అందరికి మరోసారి హ్యాపీ క్రిస్మస్ అని సీఎం తెలిపారు.
CM Revath Reddy: ఏడు పాయల అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం