Site icon NTV Telugu

Rains : మెదక్‌లో మరోసారి భారీ వర్షం.. హైవేపై వరద, స్థానికులకు తీవ్ర ఇబ్బందులు

Rains

Rains

Rains : మెదక్ జిల్లా కేంద్రంలో మరోసారి కుండపోత వర్షం కురిసింది. కేవలం రెండు గంటల వ్యవధిలోనే ఏకంగా 7 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఈ అకాల వర్షం స్థానికులకు తీవ్ర ఇబ్బందులు సృష్టించింది. గత కొన్ని వారాలుగా కురుస్తున్న వర్షాల నుంచి ఇంకా పూర్తిగా తేరుకోకముందే, మెదక్‌లో మరో భారీ వర్షం సంభవించింది. దీంతో ఇప్పటికే నీటిలో ఉన్న అనేక కాలనీలు, లోతట్టు ప్రాంతాలు మరింతగా మునిగిపోయాయి.

Bengaluru Video: బస్సులో కొట్టుకున్న డ్రైవర్‌-మహిళా ప్రయిణికురాలు.. ఏం జరిగిందంటే..!

ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వర్షం కారణంగా మెదక్-హైదరాబాద్ నేషనల్ హైవేపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పట్టణం వెల్ కం బోర్డు వద్ద భారీగా వరద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ముందుకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

ఇటీవల కురిసిన వర్షాలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న స్థానికుల్లో ఈ తాజా వర్షం మరింత ఆందోళన కలిగించింది. సరైన పారిశుధ్య వ్యవస్థ లేకపోవడం, వరద నీరు వెళ్లేందుకు మార్గాలు లేకపోవడం వల్ల ప్రతి వర్షానికి ఇదే పరిస్థితి ఎదురవుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు కోరుకుంటున్నారు. ప్రస్తుతం, వరద నీరు తగ్గుముఖం పట్టడానికి సమయం పడుతుంది, అంతవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Sreeleela : ఫ్యాన్ బాధను తీరుస్తూ ..హృదయాన్ని హత్తుకున్న శ్రీలీల రిప్లై

Exit mobile version