మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మంగళపర్తి గ్రామ శివారులో.. కారుతో పాటు దగ్దమైన వ్యక్తిని గుర్తించారు పోలీసులు. మృతదేహం గుర్తుపట్టలేని విధంగా ఉండటంతో… వివరాలు తెలుసుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే, నోటిలో ఉన్న కృత్రిమ పళ్ల ద్వారా మృతుడు శ్రీనివాస్‌గా గుర్తించారు కుటుంబసభ్యులు. ఐతే…ఎక్కడో చంపేసి కారు డిక్కీలో మృతదేహాన్ని తగలబెట్టినట్లు పోలీసుల తెలిపారు.
హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి ఫైనల్… ఇవాళ ప్రకటన !
అటవీ ప్రాంతానికి సమీపంలో రోడ్డు పక్కన గుర్తు తెలియని వ్యక్తులు కారును దగ్ధం చేశారు. కారు డిక్కీలో కాలిపోయిన మృతదేహం ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కారు ఇంజిన్ ఆధారంగా వివరాలు సేకరించిన పోలీసులు… అది మెదక్ లోని ఓ సినిమా టాకీస్ యజమానికి చెందినదిగా గుర్తించారు. మృతుడి నోటిలో ఉన్న కృత్రిమ దంతాల ఆధారంగా శ్రీనివాస్‌ను గుర్తించారు అతని భార్య హైందవి.
శ్రీనివాస్ హత్యపై వెల్దుర్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు అతని భార్య హైందవి. తన భర్తకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని.. ఈ విషయంలోనే తరచూ ఇద్దరి మధ్యా గొడవలు జరిగేవనీ తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనూ గొడవలు ఉన్నట్టు వెల్లడించారు. పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించిన పోలీసులు.. నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు.
