Site icon NTV Telugu

జ‌మున హ్యాచ‌రీస్ భూముల‌పై మెదక్ కలెక్టర్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

జ‌మున హ్యాచ‌రీస్ భూముల‌పై మెదక్ కలెక్టర్ హరీష్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. జమున హ్యాచ‌రీస్ భూముల్లో సర్వే నంబర్ లో130, 81లో సీలింగ్ భూములు, అసైన్డ్ భూములను వున్నాయని… ఈ భూముల్లో ఎస్సీ, ముదిరాజ్, వంజర వివిధ కమ్యూనిటీలు ఉన్నాయన్నారు. 56 మందికి చెందిన 70 ఎక‌రాల‌ 33 గుంటల భూములను దౌర్జన్యంగా లాక్కున్నారని వివరించారు క‌లెక్ట‌ర్‌. ఈ భూముల్లో ఎలాంటి అనుమతి లేకుండా పెద్ద పెద్ద షెడ్లు నిర్మాణం చేశారని..తెలిపారు.

76 మంది భూములను ఆక్రమించినట్లు తాము నిర్ధారణ చేశామని కలెక్టర్ హరీష్ తెలిపారు. ఎల్క చెరువు, హల్డి వాగులోకి… పౌల్ట్రీ వ్యర్థాలు విడుదల చేస్తున్నట్లు స్థానికులు ఫిర్యాదు చేశారని ఈ సందర్భంగా తెలిపారు కలెక్టర్. భూములు.. దౌర్జన్యంగా తీసుకున్న విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపామని కలెక్టర్ వివరించారు. పౌల్ట్రీ ఫామ్ కు పీసీ ఓ అనుమతి తీసుకోలేదని కలెక్టర్ హరీష్ స్పష్టం చేశారు.

Exit mobile version