ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు చేస్తున్న మోసాలు అన్ని ఇన్ని కావు.. కూర్చున్న చోటు నుండే మన నగదు మాయం అయిపోయే వరకు తెలియదు అది ఎవ్వరూ తీశారో..పెరిగినా టెక్నాలజీ పుణ్యమా అని ఓవైపు సంబరపడాలో మరో వైపు ఈ మోసాలు జరుగుతున్నాయని బాధపడాలో అర్థం కానీ సందిగ్ధంలో ఉన్నారు సామాన్యులు. ఇదిలా ఉంటే తాజాగా పీఎఫ్ ఖాతాదారులకు హెచ్చరిక జారీ చేసింది ఆ సంస్థ.
ఫోన్‌ద్వారా, మెసేజ్‌ద్వారా, ఈమెయిల్, క్యూఆర్‌కోడ్ ద్వారా లాటరీల ద్వారా వివిధ మార్గాల్లో ద్వారా సైబర్ నేరగాళ్లు ఖాతాదారుల డబ్బును కాజేస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి పీఎఫ్ ఖాతా కూడా అతీతం కాదని తెలిపోయింది. అందుకేఉ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్) తన సోషల్ మీడియా పేజీలలో ఆన్‌లైన్ మోసాలను గురించి సభ్యులను హెచ్చరిస్తు ఒక సూచన చేసింది. ఇతరులతో ఈపీఎఫ్ సమాచారాన్ని పంచుకోవడం మానుకోవాలని సభ్యులను కోరింది. ఈపీఎఫ్‌ఓ ఆధార్, పాన్, యూఏఎన్, బ్యాంక్‌ఖాతా, ఓటీపీ ఆన్‌కాల్, వాట్సాప్ సోషల్ మీడియా వంటి వ్యక్తిగత వివరాలను ఎప్పుడు అడగొద్దని స్పష్టం చేసింది. ఈపీఎఫ్ సేవలను పొందేందుకు పీఎఫ్ ఖాతాదారులను డబ్బు డిపాజిట్ చేయమని అడగదు.
ఇలా ఎవరైనా కాల్ చేస్తే సమాధానం ఇవ్వొద్దని సూచించింది. మరిన్ని ఫిర్యాదులు, పరిష్కారం కోసం ఖాతాదారులు ఈఫీఎఫ్ఓ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరింది.లేదా టోల్‌ఫ్రీ నంబర్ 1800-118-005కు కాల్ చేయవచ్చు. ఈపీఎఫ్ సభ్యులు కావాల నుకుంటే ప్రభుత్వం నిర్వహించే ఫ్లాట్‌పారమ్ UMANG యాప్‌లో ఈ సేవల సమాచారాన్ని పొందవచ్చు. ఇటీవల ఉద్యోగాలు మారిన వారు ఇంకా తమ ఈపీఎఫ్ ఖాతాను కొత్త కంపెనీకి బదీలీ చేయని వారు ఇలాంటి సైబర్ దాడులకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది. గతేడాది లాక్‌డౌన్ సమయంలో ఇలాంటి మోసాలు ఎక్కువగా జరిగాయని కంపెనీ తెలిపింది. ఇలాంటి మోసాలకు పాల్పడే వారిని అనేక లీగల్ ఏజెన్సీలు బయటపెట్టాయి. అందుకే జాగ్రత్తగా ఉండాలని ఈపీఎఫ్ ఖాతాదారులను హెచ్చరించింది.