NTV Telugu Site icon

May I Help You: గ్రూప్‌-1 అభ్యర్థుల కోసం బస్‌ స్టేషన్లలో ‘May I Help You’ కౌంటర్లు

My Help You

My Help You

May I Help You: గ్రూప్‌-1 ప్రిలిమనరీ పరీక్ష రాసే అభ్యర్థుల సౌకర్యార్థం #TGSRTC ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అభ్యర్థులకు ఆదివారం రవాణాపరంగా అసౌకర్యం కలగకుండా ప్రత్యేక బస్సులను నడుపుతోంది. రాష్ట్రంలోని 897 పరీక్షా కేంద్రాలకు బస్సులను నడపాలని క్షేత్రస్థాయి ఆర్టీసీ అధికారులకు ఇప్పటికే సంస్థ యాజమాన్యం ఆదేశాల్విడం జరిగింది. హైదరాబాద్‌ నుంచి జిల్లాలకు ఈ రోజు సాయంత్రం నుంచే అభ్యర్థుల రద్దీ ఎక్కువగా ఉన్నందున.. ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, ఉప్పల్‌, ఎల్బీనగర్‌, ఆరాంఘర్‌ పాయింట్లలో తగు ఏర్పాట్లును సంస్థ చేసింది. ఆయా ట్రాఫిక్‌ జనరేటింగ్‌ పాయింట్లలో ప్రత్యేక అధికారులను నియమించడం జరిగింది. రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను వారు అందుబాటులో ఉంచుతారు.

Read also: China : ప్రపంచంలోనే అతిపెద్ద మోసపూరిత దేశం చైనా! ఏళ్ల తరబడి ఇలాగే ప్రజలను మోసం చేస్తున్నారు

రాష్ట్రంలోని ప్రధాన బస్‌ స్టేషన్లలో ‘May I Help You’ కౌంటర్లను సంస్థ ఏర్పాటు చేసింది. అక్కడ పరీక్షా కేంద్రాల సమాచారాన్ని అభ్యర్థులకు ఇవ్వడంతో పాటు ఏ బస్సులో వెళ్లాలో అధికారులు వివరంగా చెప్తారు. రాష్ట్రవ్యాప్తంగా 4.03 లక్షల మంది విద్యార్థులు గ్రూప్-1 ప్రిలిమినరీకి హాజరవుతుండగా.. అందులో గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే దాదాపు 1.70 లక్షల మంది రాస్తున్నారు. వారికీ రవాణాపరంగా అసౌకర్యం కలగకుండా రద్దీకి అనుగుణంగా సిటీ బస్సులను అందుబాటులో ఉంచడం జరిగింది. ఆర్టీసీ బస్సుల్లో క్షేమంగా పరీక్షా కేంద్రాలకు వెళ్లి.. ప్రశాంత వాతావరణంలో గ్రూప్‌-1 ప్రిలిమనరీ పరీక్ష రాయాలని అభ్యర్థులకు ఆల్‌ ది బెస్ట్‌ అంటూ టీజీఎస్ఆర్టీసీ తెలిపింది.
బాగా బరువు పెరిగారా? అయితే ఇలా చేయండి..

Show comments