NTV Telugu Site icon

ATM Theft: జగిత్యాల జిల్లాలో భారీ చోరీ.. ఏటీఎంలో సీసీ కెమెరాలు మూసేసి రూ.19 లక్షలు..

Atm Thift

Atm Thift

ATM Theft: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని తండ్రియాల బ్రాంచ్ ఏటీఎమ్ లో భారీ చోరీకి పాల్పడ్డారు దుండుగులు. అర్థరాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఏటీఎం పగలగొట్టి సుమారు 19 లక్షల వరకు దుండగులు తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్ కూతవేటులోనే ఉన్న ఏటీఎం సెంటర్ లో జరగడం కలకలం రేపుతోంది. ఎవరికీ పట్టుబడకుండా ముందస్తు ప్లాన్‌ వేసుకున్నా దుండగులు సీసీ కెమెరాలను మూసివేసేసి చోరీకి పాల్పడ్డారు. అర్థరాత్రి కావడంతో వారి పని సులువుగా కానించారు. మెల్లగా బయటకు పరారవుదామనుకునే లోపే అక్కడున్న స్థానికులు వారిని గమనించి పోట్రోలింగ్‌ పోలీసుకుల సమాచారం ఇచ్చారు. అయితే రంగంలోకి దిగిన పోలీసులు సినిమా స్టైల్లో దుండగులను ఛేజ్‌ చేశారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు దుండగలు పరుగులు పెట్టారు. సందుల్లో గొందుల్లో దూరుతూ చాకచక్యంగా తప్పించుకునేందుకు చూడగా పోలీసులు వారిని పట్టకున్నారు. మొత్తం 4 నలుగురిని అదుపులో తీసుకున్నారు. రెండు రోజుల క్రితం ఢిల్లీలో  పట్టపగలే బహిరంగంగా ఏటీఎం క్యాష్ వ్యాన్ నుంచి బయటకు తీసిన రూ. 10 లక్షలను పట్టుకుని ఉడాయించిన ఘటన మరువక ముందే జగిత్యాల జిల్లాలో అర్థరాత్రి ఏటీఎంలో చోరీ కలకలం రేపింది.

Read also:Vande Bharat Ticket Rates: నేడే వందేభారత్ రైలు ప్రారంభం.. టికెట్ రేట్లు ఇవీ..

ఢిల్లీలో ఓ దొంగ రూ. 10 లక్షలు పట్టుకుని ఊదరగొట్టాడు. రెండు చేతుల్లో తుపాకులు పట్టుకుని సిబ్బందిని బెదిరించి ఏటీఎం నింపేందుకు ఆగి ఉన్న క్యాష్ వ్యాన్ వద్దకు వెళ్లాడు. దీంతో సిబ్బంది డబ్బు మూటను ఏటీఎం కియోస్క్‌లోకి తీసుకెళ్లారు. అంతే దొంగ సెక్యూరిటీ గార్డుపై కాల్పులు జరిపాడు. వెంటనే మిగిలిన సిబ్బంది భయంతో పరుగులు తీశారు. ఇద్దరు సిబ్బందిని బెదిరించి కియోస్క్‌ నుంచి డబ్బులు తీసుకున్నాడు. చేతిలో డబ్బు, తుపాకీతో వెళ్లిపోయాడు. ఉత్తర ఢిల్లీలోని వజీరాబాద్ ఫ్లై ఓవర్ సమీపంలోని ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన సీసీటీవీ వీడియో ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఢిల్లీలోని ఏటీఎంలో చోరీ సీసీటీవీ ఫుటేజీ

Delivery Boy: కుక్క దాడిలో డెలివరీ బాయ్ మృతి.. గత మూడు రోజులుగా కోమాలో..

Show comments