Site icon NTV Telugu

Rain Alert : హైదరాబాద్‌వాసులు అలర్ట్.. నేడు భారీ వర్ష సూచన..

Rain Alert

Rain Alert

Massive Rain Alert to Hyderabad Today Evening.
తెలంగాణను వరుణుడు వీడనంటున్నాడు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ఆగమనం ఆలస్యమైంది. కానీ రుతుపవనాలు ప్రవేశించి విస్తరించాక తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే హైదరాబాద్‌లో పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులు విరామం ఇస్తూ.. మరో మూడు రోజులు దంచికొడుతున్నాయి వానలు. అయితే ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న గంటలో హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆర్‌సీ పురం, చందానగర్‌, మియాపూర్‌ పరిసర ప్రాంతాలతో పాటు, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌, ఆల్వాల్‌, బాల్‌నగర్‌, బేగంపేట, కాప్రా ప్రాంతాలలో నేడు సాయంత్రం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

 

అయితే ఇప్పటికే లింగపల్లి ప్రాంతంలో భారీగా వర్షం కురుస్తోంది. దీంతో పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇదిలా ఉంటే.. గురువారం భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, వరంగల్ అర్బన్, రూరల్, మహబూబాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది. ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

 

 

Exit mobile version