NTV Telugu Site icon

Fake Visa: వీసాల పేరిట భారీ మోసం.. 2 కోట్లతో ఏజెంట్ పరార్‌

Fake Visa

Fake Visa

Fake Visa: అదనంగా డబ్బు సంపాందించి తమ కుటుంబానికి కష్టం రాకుండా చూసుకోవాలనే ఆశతో.. కొంత మంది గల్ఫ్‌ దేశాలకు వెళ్లేందుకు సిద్దమవుతుంటారు. గల్ఫ్ కంట్రీస్‌లో ఏదో ఒక చిన్న పని చేసుకుంటే, ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చని ఎందరో భావిస్తుంటారు. రెండు, మూడేళ్లు కష్టపడితే.. తమ సమస్యలు దూరమవ్వడంతో పాటు ఆ తర్వాతి జీవితాన్ని సుఖంగా గడపొచ్చని ఆశిస్తున్నారు. వారి ఆశనే కొందరు క్యాష్ చేసుకుంటూ.. భారీ మోసాలకు పాల్పడుతున్నారు. ఆయా దేశాలకు పంపిస్తామని చెప్పి, లక్షలకు లక్షలు కాజేస్తున్నారు. తీరా సమయం వచ్చాక, కంటికి కనిపించకుండా మాయమవుతారు. తాజాగా ఓ నకిలీ ఏజెంట్ కూడా ఇలాంటి మోసాలకే పాల్పడ్డాడు. గల్ఫ్ కంట్రీస్‌కి పంపిస్తానని అమాయకపు బాధితుల్ని నమ్మించి, భారీ డబ్బు దోచేశారు. నిజామాబాద్‌ లోని డిచ్‌ పల్లి పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

Read also: Balakrishna: బాలయ్య వాచీ చూశారా? దాన్ని ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారో తెలుసా?

నిజమాబాద్ జిల్లాలో షేక్ బషీర్ అనే ఏజెంట్‌ ప్రతక్షమయ్యాడు. 6 నెలల క్రితం ఆర్.కె. ట్రావెల్స్ పేరుతో గల్ఫ్ ఏజెంట్ అవతారం ఎత్తాడు. గల్ఫ్‌ దేశాలకు పంపిస్తానని నమ్మబలికాడు. మీకష్టలు రాకుండా అక్కడి వెళ్లి పనిచేసుకుంటే మంచి జీవితాన్ని అనుభవిస్తారని నమ్మబలికాడు. అది నమ్మని నిరుద్యోగులు కొందరు అతనికి డబ్బులు ఇవ్వడం మొదలు పెట్టారు. ఒకటి కాదు రెండు కాదు ఐదు జిల్లాలో నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల, నిర్మల్ జిల్లాల నుంచి 500 మందికి పైగా బాధితుల ద్వారా డబ్బులు కట్టించుకున్నాడు. అంతేకాదు.. సంబంధిత వ్యక్తుల పాస్ పోర్టులను తీసుకుని మెడికల్ పరీక్షలు చేయించి త్వరలోనే వీసాలు ఇస్తామని నమ్మించాడు. సుమారు వంద మందికి ఒక గ్రూప్ చొప్పున గ్రూప్ లను తయారు చేసి ఒక్కొక్కరి వద్ద రూ.లక్ష వరకు వసూలు చేసి.. గల్ఫ్ పంపిస్తానని నిరుద్యోగుల నుంచి 2కోట్ల డబ్బులు వసూలు చేశాడు.

Read also: Lips Care: చలికాలంలో పెదవులు పగిలిపోకుండా ఉండాలంటే.. ఇలా చెయ్యండి

నకిలీ ఏజెంట్ మాయ మాటలు నమ్మి ఒక్కొక్కరు 50 వేల చొప్పున నిరుద్యోగులు కట్టారు. 2 కోట్ల తో బోర్డు తిప్పేసి నకిలీ గల్ఫ్ ఏజెంట్ షేక్ బషీర్ అక్కడి నుంచి పరారయ్యాడు. నేడు వీసాలు ఇస్తానని .. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో బాధితులు ట్రావెల్ దుకాణానికి వెళ్లగా అక్కడకూడా తాళం వేసి ఉండటంతో మోసపోయామని భావించిన బాధితులు చివరకు డిచ్ పల్లి పోలీసులకు పిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని లక్షల్లో మోసపోయామని వాపోయారు. కడుపును కొట్టుకుని సంపాదించామని కొందరు కన్నీరుపెట్టుకుంటుంటే.. మరికొందరు అప్పులు చేసి డబ్బులు కట్టామని ఇలా మోసపోయామని, నట్టేటమునిగిపోయామంటూ గుండెలు బాదుకుంటూ న్యాయం చేయాలని పోలీసులకు కోరుతున్నారు.
Minister KTR: నేడే సిరిసిల్లకు కేటీఆర్‌.. అమ్మమ్మ ఊరులో బడి నిర్మాణానికి శంకుస్థాపన