NTV Telugu Site icon

Dowry Harassment: నా భార్య ఆత్మహత్య చేసుకుంది. ఆసుపత్రిలో శవాన్ని వదిలేసి భర్త పరార్‌

Sangareddy Crime

Sangareddy Crime

Dowry Harassment: సంగారెడ్డి జిల్లా కంది మండలం జుల్కల్ లో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. గత కొన్ని రోజులుగా తరుణం బేగంని వరకట్నం కోసం భర్త సాబేర్ మాలిక్, అత్త మామలు వేధిస్తుండంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు వరకట్నం కోసం గొడవ మొదలయ్యాయి. దీంతో మనసికంగా కుంగిపోయాన తరుణం బేగం ఇంట్లో రాత్రి ఉరి వేసుకుని చనిపోయిందని చెప్పి సంగారెడ్డి ఆస్పత్రిలో తరుణం బేగం శవాన్ని వదిలేసి భర్త, అత్తమామలు పరార్ అయ్యారు. భర్త, అత్తమామలే 25 వేల రూపాయల కట్నం కోసం చంపేశారని మృతురాలి బంధువుల ఆరోపిస్తున్నారు. మృతురాలికి మూడు సంవత్సరాలు కొడుకు ఉన్నాడు. ఆ బాలుడి పరిస్థితి ఏంటని రోదిస్తున్నారు. తల్లి శవాన్ని చూస్తూ అమ్మకావాలని ఏడుస్తున్న ఆ బాలుడ్ని ఓదార్చ డానికి ఎవరితరం కాలేదు.

సంగారెడ్డి జిల్లా కంది మండలం జుల్కల్ లో సాబేర్ మాలిక్ కుటుంబం నివాసం ఉంటుంది. సాబేర్ మాలిక్ తో తరుణం బేగం ఇచ్చి తల్లి దండ్రులు వివాహం జరిపించారు. అయితే వీరిద్దరి కాపురం కొద్దిరోజులు సజావుగా సాగిన కొద్ది రోజులకు వీరిద్దరి మధ్య వరకట్న వేధింపులు మొదలయ్యాయి. సాబేర్‌ మాలిక్‌ తో సహా అత్త మామలు తరుణం బేగంకు డబ్బు తేవాలని వేధించడం మొదలయ్యాయి. అయితే ముందు పుట్టింటి నుంచి తెచ్చిన డబ్బులను అత్త మామమలకు ఇచ్చింది. రాను రాను ఇదే వరుస కొనసాగించారు అత్తింటి వారు. ఇలా సాగుతుండగానే తరుణం బేగంకు బిడ్డ పుట్టాడు. అయితే దీని వల్లైన అత్తింటి వారు మారుతారన్న ఆశతో వున్న తరుణం బేగంకు ఇంకా ఎక్కువయ్యాయి. నీకే కాకుండా నీబిడ్డ కూడా ఇక్కడే ఉండాలంటే మీ ఇంటి నుంచి డబ్బులు తేవాల్సిందే అంటూ వేధింపులు మొదలయ్యాయి. డబ్బులు తీసుకురావాల్సిందే అని భర్త, అత్తమామలు డిమాండ్ చేశారు.

దీంతో సహనం కోల్పోయిన తరుణం బేగం పుట్టింటి వారికి భారం కాలేక ఆత్మహత్య పాల్పడింది. నిన్న రాత్రి భర్త, అత్తమామలు వేధింపులకు తాళలేక ఇంట్లోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో భర్త అత్తమామలు తరుణం బేగం మృతదేహాన్ని ఆసుపత్రికి తీసుకుని వచ్చారు. ఆమె ఉరివేసుకుని ఆత్మహత్యా చేసుకుందని అక్కడినే వదిలేసి భర్త, అత్తమామలు పరార్‌ అయ్యారు. దీనిపై ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి తరుణం బేగం కుటుంబ సభ్యులకు సమచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న తరుణం బేగం కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. తరుణం బేగం ఆత్మహత్య చేసుకునేంత పిచ్చిది కాదని, తనని అత్తింటి వారే చంపేశారంటూ ఆరోపించారు. వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. వీరి వరకట్న వేధింపులకు తన కన్న కూతురు చనిపోగా.. మనవడు దిక్కలేకుండా అయిపోయాడని వాపోయారు. వారికి తగిన న్యాయం చేయాలని కోరుతున్నారు.
Kia Seltos 2023: కొత్తగా రాబోతోన్న కియా సెల్టోస్.. జూలై 4న ఆవిష్కరణ…

Show comments