NTV Telugu Site icon

Maoists Mulugu District: వ్యక్తిని దారణంగా చంపిన మావోయిస్టులు.. ఇన్‌ఫార్మర్‌ అంటూ లేఖ

Maoists Mulugu District

Maoists Mulugu District

Maoists Mulugu District: తెలంగాణలోని గిరిజనులు మెజారిటీగా ఉన్న ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో మావోయిస్టుల ఘాతుకానికి ఒడిగట్టారు. ఇన్ఫార్మర్ నేపంతో కొండాపురం గ్రామానికి చెందిన సబక గోపాల్ అనే వ్యక్తిని బుధవారం అర్థరాత్రి దారుణంగా హత్యచేశారు. పోలీసులకు ఇన్‌ఫార్మర్‌గా పని చేస్తున్నాడని మావోయిస్టులు తమ లేఖలో పేర్కొన్నారు. ఎవరైనా ఇన్ఫార్మర్ గా వ్యవహరిస్తే.. ఎవరికైనా ప్రజా కోర్టులో శిక్ష తప్పదని వెల్లడించారు. ఈ మేరకు వాజేడు ఏరియా కమిటీ పేరిట లేఖ విడుదల చేశారు. ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరించే వారు పద్దతి మార్చుకోకుంటే ప్రజాకోర్టు శిక్ష తప్పదని లేఖలో వార్నింగ్‌ ఇచ్చారు. ములుగు జిల్లాలో డీజీపీ మహేందర్ రెడ్డి పర్యటించి 15 రోజులు గడపకముందే ఈఘటన సంచలనంగా మారింది. ఏజెన్సీలో డీజీపీ పర్యటించిన మరుక్షణం మావోయిస్టులు ఇన్ ఫార్మర్లను హత మారుస్తున్నారు. గిరిజనుడిని మావోయిస్టులు హత్య చేయడంతో తాజా ఘటనతో ఏజెన్సీలో ప్రజలు బిక్కు బిక్కుమంటూ జీవనం గడుపుతున్నారు.

read also: Pan Fried Chicken: చికెన్ తక్కువ.. ప్రొటీన్ ఎక్కువ..

బుధవారం అర్థరాత్రి గోపాల్‌ ఇంట్లో ఉన్న సమయంలో ఐదుగురు అనుమానితులు ఇంట్లో చొరబడ్డారని వారిని చూసి గోపాల్‌ బయటకు పెరగెత్తగా వెంబడించిన గ్రామ సమీపంలోకి తీసుకెళ్లి విచక్షణారహితంగా కత్తులతో పొడిచి గొడ్డలితో నరికి చంపారు. అనంతరం లాల్‌ సలామ్‌ అంటూ నినాదాలు చేసుకుంటూ అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయారని స్థానికులు పేర్కొన్నారు. మృతుడు కొండాపూర్ కు చెందిన వాడిగా గుర్తించారు పోలీసులు.మృతుడికి ఇద్దరు భార్యలు, ఐదుగురు పిల్లలు ఉన్నారు. పోలీస్ ఇన్‌ఫార్మర్ గా వ్యవహరించడంతోనే హత్య చేసినట్లు వెంకటాపురం వాజేడు ఏరియా కమిటీ పేరుతో లేఖ విడుదల చేశారు. 15రోజుల క్రితం మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో డీజీపీ మహేందర్‌రెడ్డి తెలంగాణ-ఛత్తీస్‌గడ్‌ సరిహద్దల్లో పర్యటించి పోలీసులను అప్పమత్తం చేసిన విషయం తెలసిందే.. అయినప్పటికి ఇలా హత్య జరగడం ఎజెన్సీలో కలకలం రేపుతోంది. మరి దీనిపి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోనున్నారో వేచి చూడాలి.