Maoists : దేశంలో మావోయిస్టుల లొంగుబాట్లకు సంబంధించి తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. మావోయిస్టు కేంద్ర కమిటీ అభయ్ పేరుతో నాలుగు పేజీల లేఖ విడుదల చేసింది. ఈ లేఖలో, ఇటీవల పోలీసులు ఎదుట లొంగిపోయిన మాలోజుల వేణుగోపాల్ (Mallojula Venugopal), ఆశన్నలు (Ashanna) వంటి నేతల వ్యవహారాన్ని ప్రత్యేకంగా గుర్తించి, వారిని “విప్లవ ద్రోహులు”గా పేర్కొంది.
అల్లం తినడం వల్ల శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే !
శత్రువుల ఎదుట లొంగిపోయి పార్టీ నష్టానికి కారణమైన నేతలకు తగిన శిక్ష ప్రజలే విధిస్తారని మావోయిస్టు కేంద్ర కమిటీ పేర్కొంది. లేఖలో, మల్లోజుల గత కాలపు తప్పులు, బలహీనతలను కూడా ప్రస్తావించారు. 2018లో పార్టీ తాత్కాలిక వెనుకంజ వేసింది.. 2020లో కేంద్ర కమిటీ సమావేశంలో మల్లోజుల తప్పుడు భావజాలం, ఆయుధాలను వదిలిపెట్టడంపై వితండవాదం బయటపడింది. ప్రస్తుతం లొంగిపోవడం పార్టీకి తాత్కాలిక నష్టం మాత్రమే అని కమిటీ పేర్కొంది. కమిటీ తన చర్చ లేకుండా మల్లోజుల లొంగిపోయిన విషయాన్ని నిర్దేశిస్తూ, “ప్రాణ భీతితో ఎవరైనా లొంగిపోవచ్చు, కానీ పార్టీకి నష్టం కలిగితే ప్రజలే బుద్ధి చెబుతారు” అని హెచ్చరించింది. ఈ లేఖా ప్రకటన దేశంలో మావోయిస్టు సంఘటనలపై మరోసారి దుమారం రేపుతోంది.
IND vs AUS: టీమిండియా ఘోర ఓటమి.. 21 ఓవర్లలో టార్గెట్ ఛేదించిన ఆసీస్
