అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి అల్లుడు మంజునాథ రెడ్డి అనుమానాస్పదస్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లెలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఆయన ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే మంజునాథరెడ్డి మృతికి సహస్ర కంపెనీ నిర్వాహకుడు చక్రధర్ అనే వ్యక్తి కారణమని ఆయన తండ్రి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. చక్రధర్ కు వ్యాపారం నిమిత్తం డబ్బులు తీసుకొని తన కుమారుడు మంజునాథ్ కు మోసం చేసాడని, మానసిక క్షోభకు గురి చేశారని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.
తన దగ్గర తీసుకున్న డబ్బులు మంజునాథ్ ఎన్ని సార్లు చక్రధర్ అడిగా తిరిగి ఇవ్వలేదని, నాలుగేళ్లుగా తనచుట్టూ తిప్పుకుని ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని కన్నీరు పెట్టుకున్నాడు తండ్రి. తనకు ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని వేడుకున్నాడు. అన్నమయ్య జిల్లా రామాపురం మండలంలోని పప్పిరెడ్డి గారి పల్లెలో మంజునాథరెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. తన అల్లుడి మృతదేహం చూడగానే రాయదుర్గం ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి బోరు విలపించారు.
MP K.Laxman : మునుగోడు సభలో కేసీఆర్ ఓటమి కన్పించింది