NTV Telugu Site icon

Mancherial: మంచిర్యాల‌లో 600 పడకల ఆసుపత్రి.. నిర్మాణ పనులకు మంత్రి దామోదర శంకుస్థాపన..

Minister Damodara Raja Narasimha

Minister Damodara Raja Narasimha

Mancherial: మంచిర్యాల‌లో నేడు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ పర్యటించనున్నారు. జిల్లాకు 600 బెడ్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ప్రభుత్వం మంజూరు చేసిన విషయం తెలిసిందే.. ఈ హాస్పిటల్‌ భవన నిర్మాణ పనులకు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమానికి మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క పాల్గొననున్నారు. ఈ కార్యక్రమ అనంతరం మంచిర్యాలలో జరగనున్న సభలో మంత్రి దామోదర ప్రసంగించనున్నారు.

Read also: Kubera : ధనుష్ ‘కుబేర’ రిలీజ్ డేట్ లాక్.. శేఖర్ కమ్ముల ప్లాన్ మామూలుగా లేదుగా

మంచిర్యాలలో సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుబాటులో ఉంటుంది. జిల్లా కేంద్రంలోని ఐబీ స్థలంలో 4.22 ఎకరాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం కానుంది. ఐబీలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను కూల్చివేసి దాని స్థానంలో ఆస్పత్రిని నిర్మించనున్నారు. మొత్తం 600 పడకలకు 225 పడకలతో ఒక మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ (MCH) ఏర్పాటు చేయబడుతుంది. ప్రస్తుతం గోదావరి ఒడ్డున ముంపు ప్రాంతంలో ఉన్న ఎంసీహెచ్‌ని ఇక్కడికి తరలించనున్నారు. మిగిలిన 375 పడకల సామర్థ్యంతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం రూ.300 కోట్లతో అంచనాలు రూపొందించగా, ప్రభుత్వం 2024-25 బడ్జెట్‌లో రూ.50 కోట్లు కేటాయించింది.
Air Pollution: ఉత్తర భారతానికి ‘విషపూరిత’ గాలి ముప్పు..

Show comments