NTV Telugu Site icon

వనస్థలిపురంలో దారుణం.. హత్య చేసి కరోనాపై నెట్టి..!

death

death

కరోనా కల్లోలం సృష్టిస్తూ ఎంతోమంది ప్రాణాలు తీసింది.. ఇది కూడా అదునుగా భావించినవారు కూడా లేకపోలేదని.. వెలుగుచూస్తున్న కొన్ని ఘటనలు చెబుతున్నాయి… తాజాగా హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో దారుణం జరిగింది.. భార్యను హత్యచేసి కరోనాతో మృతి చెందినట్టు చిత్రీకరించి.. భార్య మృతదేహానికి అంత్యక్రియలు చేయించాడు భర్త.. అయితే, అతని ప్రవర్తనపై అత్తింటివారికి అనుమానం వచ్చింది. దీంతో, తమ కూతురు కరోనాతో మృతి చెందలేదని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు మృతురాలు కవిత తల్లిదండ్రులు.. ఇక, రంగంలోకి దిగిన పోలీసులు.. కవిత మృతదేహానికి రీపోస్టుమార్టం చేయించారు.. ఆమె కోవిడ్‌తో చనిపోలేదని పోస్టుమార్టం చేసిన వైద్యులు తేల్చారు. కవితను హత్య చేసి గుట్టు చప్పుడు కాకుండా ఆమె భర్త విజయ్‌ అంత్యక్రియలు నిర్వహించినట్టు గుర్తించిన రాచకొండ పోలీసులు.. విజయ్‌ను అరెస్ట్ చేశారు.