నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై హత్యా ప్రయత్నం జరిగింది. బంజారాహిల్స్ రోడ్ నం 12 లోని వేమూరీ ఎన్ క్లేవ్ లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఎన్ క్లేవ్‌లో జీవన్‌రెడ్డి ఇంటివద్ద అనుమానాస్పదంగా ఓ వ్యక్తి తిరుగుతుండగాన్ని గమనించిన ఎమ్మెల్యే భద్రతా సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో క్షణాల్లోనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా సంచలన విసయాలు బయటకు వచ్చాయి. సర్పంచ్ భర్తే హత్యకు కుట్ర చేసాడని విషయం బయటకు వచ్చింది. అయితే.. నిందితుడిని మక్లూర్ మండలం కల్లాడి గ్రామ సర్పంచ్ భర్త ప్రసాద్ గౌడ్‌గా పోలీసులు గుర్తించారు.
read also: KTR Tweet Today: ఆత్మ నిర్భర్ భారత్ చాలా బాగుంది..! ప్రశంస..? ఎద్దేవా?
నిందితులు ప్రసాద్ గౌడ్ వద్ద నుంచి తుపాకీ, కత్తి స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కక్షపూరితంగా హత్యకు కుట్ర చేసానని నిందితుడు అంగీకరించాడు. అయితే.. నిందితుని భార్య పెద్దగాని లావణ్యను సర్పంచ్ పదవి నుంచి ఎమ్మెల్యే సస్పెండ్ చేయించారన్న కక్షతోనే నిందితుడు ప్రసాద్‌గౌడ్ ఆయన్ని హత్య చేసేందుకు పథకం వేసాడని, నిందితుడిని పూర్తిస్థాయిలో విచారిస్తున్నామని, అన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.
Kalyan Ram: సంచలన నిర్ణయం.. అదే జరిగితే సినిమాలు మానేస్తా