Site icon NTV Telugu

Mallikarjun Kharge: కొన్ని హామీలు అమలు చేయలేక పోయాం.. కారణం చెప్పిన ఖర్గే

Mallikharjuna Kharge

Mallikharjuna Kharge

Mallikarjun Kharge: ఎన్నికల కోడ్ రావడంతో కొన్ని హామీలు అమలు చేయలేక పోయామని ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే తెలిపారు. హైదరాబాద్ చేరుకున్న ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకు బేగంపేట విమానాశ్రయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాదర స్వాగతం పలికారు. ఇచ్చిన హామీల్లో ఇందిరమ్మ ఇండ్లు.. ఉచిత బస్సు.. 500 సిలిండర్ లంటి పథకాలు అమలులోకి వచ్చాయన్నారు. రైతులకు అండగా నిలిచామన్నారు. మోడీ..అమిత్ షా లు ఆందోళన లో ఉన్నారని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టో చెప్పడం లేదు.. అభివృద్ధి మీద చర్చ చేయడం లేదు వాళ్ళు అని మండిపడ్డారు.

Read also: Beijing: మరో యుద్ధ నౌకను సిద్ధం చేసిన డ్రాగెన్.. భారత్ కు ప్రమాదం పొంచి ఉందా..?

కాంగ్రెస్ గురించి.. మట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే కాంగ్రెస్ ని చూసి భయపడుతున్నారని అన్నారు. తిండి గురించి.. మంగళ సూత్రం గురించి.. మైనార్టీల గురించి మాట్లాడుతున్నాడు మోడీ అంటూ మండిపడ్డారు. నల్లధనం గురించి మాట్లాడటం లేదు.. తన మిత్రులు అదాని, అంబానీ గురించి మాట్లాడటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదాని, అంబానీ రాహుల్ గాంధీకి డబ్బులు ఇచ్చారు అంటున్నాడు మోడీ అన్నారు. మీ సీబీఐ ఏమైంది.. ఈడీ ఏం చేస్తుంది? అని ప్రశ్నించారు. ఇన్కమ్ టాక్స్ ఏం చేస్తుంది? విచారణ జరిపించు అంటూ సవాల్ విసిరారు. కాగా.. ఇవాళ సాయంత్రం 4 గంటలకు నకిరేకల్ జన జాతర సభకు హాజరుకానున్నారు.

Read also: MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈ నెల 24కు వాయిదా..

మరోవైపు లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ బ్రాహ్మణ సంఘాల ఐక్య వేదిక నాయకులు తులసి శ్రీనివాస్ మద్దతు తెలిపారు. హైదరాబాద్ హైదర్ గూడ లోని ఎన్ఎస్ఎస్ లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ… తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుంటేనే… జిహెచ్ఎంసి ఎన్నికల్లో 10 సీట్లు బ్రాహ్మణులు పోటీ చేసే అవకాశం ఉంటుందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో 20 లక్షలు మంది బ్రాహ్మణుల జనాభా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ గతంలో బ్రాహ్మణులకు రాజకీయంగా ప్రాధాన్యత కల్పించిందన్నారు. పీవీ నరసింహారావు లాంటి వారికి ప్రధాని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ను కలిసి తమ సమస్యలను వివరించామన్నారు. బ్రాహ్మణ పరిషత్ కు 100 కోట్లు నిధులు మంజూరు చేసి , సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు. బ్రాహ్మణులు అందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అండగా ఉండి… గెలుపుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
Bandi Sanjay: నీ మెడలు వంచి.. ప్రభుత్వాన్ని గద్దె దించింది నేనే.. కేసీఆర్ పై బండి సంజయ్‌ ఫైర్‌

Exit mobile version