వైద్యరంగంలో పేరున్న మల్లారెడ్డి నారాయణ హాస్సిటల్ (Mallareddy Narayana Hospital) వరల్డ్ హార్ట్ డే సందర్భంగా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గుండె జబ్బులపై అవగాహన పెంచడానికి ఈనెల 29వ తేదీన ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. గురువారం ఉదయం 6 గంటలకు కొంపల్లి మెయిన్ రోడ్ లో వున్న డెకథ్లాన్ ఆవరణ నుంచి సినీ ప్లానెట్ వరకూ 5 కిలోమీటర్ల మేర సైకిల్ యాత్ర చేపట్టనుంది. ఈ ఈవెంట్ లో పాల్గొనదలిచిన వారు ఉదయం ఆరుగంటలకు డెకథ్లాన్ ఆవరణలోని రిసెప్షన్ లో సంప్రదించాల్సి వుంటుంది.
వివిధ కారణాల వల్ల హృద్రోగాలు పెరిగిపోతున్నాయి. మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్స్ వారు హైదరాబాద్ వ్యాప్తంగా తమ సేవల్ని విస్తరించారు. కొంపల్లిలో మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని ఏర్పాటుచేసి సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ నగర ఉత్తరభాగంలో వేగంగా విస్తరిస్తున్న కొంపల్లి, మేడ్చల్ ప్రాంత వాసులకు ఈసేవలు విస్తరించారు. MRGI ఛైర్మన్ సీహెచ్. భద్రారెడ్డి మాట్లాడుతూ.. మల్లారెడ్డి ఆస్పత్రుల ద్వారా గుండె సంబంధిత వ్యాధుల గురించి అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. చెప్పాపెట్టకుండా వచ్చి ప్రాణాలను హరించే ఈ మహమ్మారిని ఆదిలోనే గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. గుండె జబ్బుల నివారణకు వరల్డ్ హార్ట్ ఫెడరేషన్స్ సౌజన్యంతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
ప్రతి ఏటా సెప్టెంబర్ 29వ తేదీన వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ వివిధ ఈవెంట్లను నిర్వహిస్తోందని భద్రారెడ్డి తెలిపారు. వివిధ హెల్త్ కేర్ సంస్థలు అవగాహన కార్యక్రమాలు, రోగుల్ని చైతన్యవంతం చేసేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆరోగ్యకరమయిన గుండెను పదిలపరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది. వరల్డ్ హార్ట్ డే నాడు చేపట్టే కార్యక్రమాలను మరింతగా విస్తరించాలని భావిస్తోంది వరల్డ్ హార్ట్ ఫెడరేషన్. అందులో భాగంగా సైకిల్ యాత్ర చేపట్టింది. సెప్టెంబర్ 29న నిర్వహిస్తున్న ఈ సైకిల్ యాత్రలో పెద్దసంఖ్యలో పాల్గొనాలని MRGI ఛైర్మన్ సీహెచ్ భద్రారెడ్డి ఆకాంక్షించారు.
ఈవెంట్ వివరాలు
ఉదయం ఆరుగంటలు: కార్యక్రమంలో పాల్గొనేందుకు మీ అంగీకారం తెలుపుతూ.. రిజిస్ట్రేషన్ కౌంటర్ లో వివరాలు అందచేయాలి. అక్కడ టీ షర్ట్ అందుకోవాలి.
అనంతరం మీ గుర్తింపునకు సంబంధించిన ఆధార్/పాన్ కార్డు అక్కడి సిబ్బందికి అందచేసి అక్కడ సైకిల్ తీసుకోవాలి( సైకిల్ అవసరమయినవారు మాత్రమే)
ఉదయం 8 గంటలు: డెకథ్లాన్ నుంచి సినీ ప్లానెట్ వరకూ సైకిల్ యాత్రలో పాల్గొని తిరిగి సైకిళ్ళను రిసెప్షన్ కౌంటర్లో అందచేసి మీ గుర్తింపు కార్డులు తిరిగి తీసుకోవచ్చును.
ఉదయం 8.15 నిముషాలు: ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి బ్రేక్ ఫాస్ట్
మరింత సమాచారం కోసం. 88868 23404 నెంబరులో సంప్రదించవచ్చు.
