NTV Telugu Site icon

Malkajigiri BRS MP Candidate: ఓటమిని సమీక్షించుకుంటాం..

Malkajigiri Brs Mp Candidate

Malkajigiri Brs Mp Candidate

Malkajigiri BRS MP Candidate: ఓటమిని సమీక్షించుకుంటామని మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మా రెడ్డి అన్నారు. ఓటమిని అంగీకరించిన ఆయన కౌంటింగ్ కేంద్రం నుండి బయటకు వెళ్లిపోయారు. ప్రజా క్షేత్రంలో గెలుపు ఓటములు మామూలే అన్నారు. ఓటమిని సమీక్షించుకుంటామన్నారు. ప్రజల అంగీకారాన్ని మేము స్వాగతిస్తున్నామన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ ఓట్ల మూడో రౌండ్ కౌంటింగ్ పూర్తయింది. మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు లో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ 1,85,000 ఓట్ల మెజారిటీతో మొదటి స్థానంలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి రెండవ స్థానంలో కొనసాగుతున్నారు. ఇప్పటివరకు కాంగ్రెస్ అభ్యర్థికి ఒక లక్ష 1,85,000 పోలయ్యాయి.

కాగా బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఇప్పటివరకు ఆధిక్యంలో వున్నారు. మేడ్చల్ లో బీజేపీ 10458 ఓట్లు కాగా.. కాంగ్రెస్ 5817, బీఆరెస్ 2770, ఇక మల్కాజ్ గిరిలో బీజేపీ 7872, కాంగ్రెస్ 3575, బీఆర్ ఎస్ 2953 ఓట్లు వచ్చాయి. ఇక కుత్బుల్లాపూర్ లో బీజేపీ 6776 రాగా.. కాంగ్రెస్ 6027, బీఆర్ఎస్ 3639 ఓట్లు నమోదయ్యాయి. కూకట్ పల్లిలో బీజేపీ 4889, కాంగ్రెస్ 4566, బీఆర్ఎస్ 1842 ఓట్లు వచ్చాయి. ఉప్పల్ లో బీజేపీ 5351 ఓట్లు రాగా.. కాంగ్రెస్ 3997, బీఆర్ఎస్ 2945 నమోదయ్యాయి. ఎల్ బి నగర్ లో బీజేపీ 8473 కాగా.. కాంగ్రెస్ 5297, బీఆర్ఎస్ 2317 నమోదయ్యాయి. కంటోన్మెంట్ లో బీజేపీ 4431, కాంగ్రెస్ 1943, బీఆర్ఎస్ 912 ఓట్లు నమోదయ్యాయి. అంబర్పేట నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో 17 రౌండ్లకు గాను 14వ రౌండ్ పూర్తయ్యే సరికి నమోదైన ఓట్లు..1,18,227 కాగా.. బీజేపీ 63,115, కాంగ్రెస్ 37,666. బిఆర్ఎస్ 14,889 ఓట్లు నమోదయ్యాయి. మొత్తంగా బీజేపీ 25,449 ఆధిక్యంలో ఉన్నారు.
Lok Sabha Election Result 2024: అధికార ఎన్డీయే కూటమికి తొలి విజయం