Site icon NTV Telugu

Fake Beers: మహబూబ్ నగర్‌లో నకిలీ బీర్లు కలకలం..

Mahaboobnagar

Mahaboobnagar

Fake Beers: మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నకిలీ బీర్లు కలకలం సృష్టించాయి. బీర్లు ఆర్డర్ చేస్తే కల్తీ కల్లు సీసాలు ఇస్తున్నారని మందుబాబులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో నైన్ బార్ అండ్ రెస్టారెంట్‌ నిర్వహిస్తున్నారు. అయితే ఆ రెస్టారెంట్‌ లో ఆన్‌లైన్‌ అర్డర్‌ సౌకర్యం కూడా ఉంది. దీంతో పలువురు వినియోగదారులు నైన్ బార్ అండ్ రెస్టారెంట్‌లో బీర్లను ఆర్డర్‌ చేశారు. బీర్‌ అయితే వచ్చాయి కానీ.. బీర్‌ సీసాలో కల్తీ కల్లు ఉండటం చూసి షాక్‌ అయ్యారు. బీర్‌ సీసాల్లో కల్తీ కల్లు నింపి విక్రయిస్తున్నారని మండిపడ్డారు. దీంతో వినియోగదారుడు ఏకంగా నైన్ బార్ అండ్ రెస్టారెంట్‌కు వెళ్లారు. బీర్‌ సీసాలో కల్తీకల్లు వుందని ప్రశ్నించాడు.

Read also: Most Outs in 90s: అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక సార్లు 90లలో అవుటైన ఆటగాళ్లు ఎవరో తెలుసా..?

అయితే నైన్ బార్ అండ్ రెస్టారెంట్‌ యాజమాన్యం మాత్రం పొంతలేని సమాధానం చెప్పడంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీర్ సీసాల్లో కల్తీకల్లు నింపి విక్రయిస్తున్నారని మండిపడుతున్నారు. మద్యం తాగడం కోసం నైన్ బార్ అండ్ రెస్టారెంట్‌కు ఓ వ్యక్తి రావడంతో అక్కడ కల్తీకల్లు సీసా దర్శనమిచ్చాయని వాపోయాడు. ఇదేంటి అని అడిగితే షాప్‌ ఓనర్‌ దబాయిస్తున్నారని తెలిపాడు. బీర్లలో కల్తీ చేసి అమ్ముతున్నారని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నైన్ బార్ అండ్ రెస్టారెంట్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. బీర్లలో కల్తీ చేసి.. వినియోగదారుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
World Bank: మహారాష్ట్రకు 188 మిలియన్ డాలర్లు.. ప్రపంచ బ్యాంక్ ఆమోదం

Exit mobile version