NTV Telugu Site icon

Mahabubabad: రోడ్డుపై బోల్తాపడిన చేపలలోడు బొలోరో వాహనం..

Fish Van

Fish Van

Mahabubabad: మహబూబాబాద్ జిల్లా మరిపెడ బస్టాండ్ సమీపంలో చేపల లోడ్ తో వెళుతున్న బొలోరో వాహనం బోల్తాపడింది. దీంతో వాహనంలోని చేపలు చెల్లాచెదురుగా రోడ్డు పై పడ్డాయి. అది చూసిన స్థానికులు చేపలు పట్టేందుకు ఎగబడ్డారు. దొరికిన చేపలను పట్టుకుని తీసుకెళ్లారు. అటుగా వెళ్తున్న వాహనదారులు సైతం చేపలు పట్టేందుకు ఎగబడ్డారు. కొందరు దొరికిన చేపలను సంచుల్లో వేసుకున్నారు. చేపలు పట్టేందుకు స్థానికులు రోడ్డుపై పెద్ద సంఖ్యలో రావడంతో కాసేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. బోలోరో వాహన డైవర్ లబోదిబో మన్నాడు. బోలోరో వాహన యజమానికి విషయం కాస్త వివరించాడు. సహాయం చేయాల్సింది పోయి దొరికింది ఛాన్స్ అంటూ స్థానికులు చేపలకోసం ఎగబడటంతో.. చేసేందీ ఏమీ లేక అక్కడి నుంచి డ్రైవర్ వెనుతిరిగాడు. అయితే ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడంతో పోలీసులు అక్కడకు చేరుకుని స్థానికులను వెల్లగొట్టేందుకు ప్రయత్నించారు. ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతుందని సహకరించాలని కోరారు. అయినా స్థానికులు వినకుండా చేపలు పట్టుకునే పనిలో పడ్డారు. ఇక పోలీసులు కూడా చేసేదేమి లేక చూస్తూ ఉండిపోయారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా వేరే రూట్ లో వాహనాలను తరలించారు.
Jr NTR : దేవర RTCక్రాస్ రోడ్ ‘ఆల్ టైమ్ రికార్డ్’.. ప్రభాస్, మహేష్ రికార్డ్స్ గల్లంతు