Maganti Sunitha Gopinath : జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న మాగంటి సునీత గోపీనాథ్ కు పార్టీ అధినేత కేసీఆర్ బీ-ఫామ్ అందజేశారు. ఎన్నికల ఖర్చు కోసం పార్టీ తరపున రూ. 40 లక్షల చెక్కును మాగంటి సునీతకు అందజేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైన తరువాత నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది.
ప్రతి రోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థుల నామినేషన్లు స్వీకరించబడుతున్నాయి. ఇక బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల మధ్య నామినేషన్ దాఖలు చేయనున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి నామినేషన్ సమయంలో ఎలాంటి హంగులు లేకుండా, కేవలం నలుగురితో కలిసి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
Cough Syrup Tragedy: దగ్గు సిరప్ కేసులో సంచలన నిజాలు.. కమీషన్‌కి కక్కుర్తి పడ్డ వైద్యుడు..!
