Made in Hyderabad Guns: హైదరాబాద్‌లో తుపాకులు తదితర చిన్న రక్షణ ఆయుధాల తయారీ ప్రారంభంకానుంది. ఈ మేరకు మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ కంపెనీ ఐకామ్.. UAEకి చెందిన ఎడ్జ్ గ్రూప్ కంపెనీ కారకాల్‌తో ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా మన దేశ రక్షణ దళాల కోసం లోకల్‌గా చిన్న ఆయుధాలను తయారుచేయటమే కాకుండా ఎగుమతులు కూడా చేస్తుంది. మేఘా గ్రూప్ కంపెనీ ఐకామ్ ఇప్పటివరకు మిసైల్స్, డ్రోన్స్, కౌంటర్ డ్రోన్స్, సబ్ సిస్టమ్స్, కమ్యూనికేషన్స్ అండ్ ఈడబ్ల్యూ సిస్టమ్స్, ఎలక్ట్రో-ఆప్టిక్స్ వంటి పరికరాలను తయారుచేస్తోంది.
also read: DGP Mahender reddy: పోలీస్ శాఖ దేశంలోనే అత్యాధునిక పరిజ్ఞానంతో ముందుకు కొనసాగుతోంది
కారకాల్‌తో ఒప్పందం నేపథ్యంలో హైదరాబాద్‌లోని అభివృద్ధి మరియు తయారీ కేంద్రంలోనే వీటి రూపకల్పనకు శ్రీకారం చుట్టనున్నట్లు ఐకామ్ అధినేత పి.సుమంత్ పేర్కొన్నారు. కంపెనీ చరిత్రలో ఇదొక కీలక మలుపని చెప్పారు. కారకాల్ సీఈఓ హమద్ అల్‌మెరి మాట్లాడుతూ కీలకమైన ఇండియన్ మార్కెట్‌లోని అవకాశాలను సద్వినియోగం చేసుకోవటానికి భాగస్వామ్య ఒప్పందాలను కుదుర్చుకోనున్నామని అన్నారు. విశ్వ నగరంగా రోజు రోజుకీ రూపుమారుతున్న హైదరాబాద్‌లో ఇప్పుడు తుపాకీల తయారీ కూడా మొదలుకానుండటంతో భవిష్యత్తులో ఇక్కడ దొరకని వస్తువంటూ ఉండదేమోనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
