Police Harassment of Woman: రక్షించాల్సిన రక్షభటులే భక్షిస్తే.. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే హద్దులుమీరితే.. ఇక ప్రజలకు న్యాయం కోసం ఎక్కడి వెళ్లాలి. నేరం జరిగితే పోలీసు దగ్గరకు వెళ్లి న్యాయం చేయండి అంటూ కోరే రోజులు పోతున్నాయి. ఎందుకంటే న్యాయం చేయాల్సిన పోలీసులే నేరాలకు పాల్పడుతున్నారు. మహిళలపై అఘ్యాయిత్యాలకు పాల్పడితే పోలీసులు ఒక్కనిమిషంలో హాజరై నేరస్తుల్ని పట్టుకుంటారు అంటున్నా అధికారులకు పోలీసు అనే యూనిఫ్యామ్ వేసుకుని పోలీస్ అనేపేరుతో మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. న్యాయం కోసం పోలీసుల దగ్గరకు వెళ్లాల్సిన మహిళలపై పోలీసులే అత్యాచారం చేస్తూ ఎవరికైనా చెబితే చంపేస్తా అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇది ఎక్కడో కాదు తెలంగాణలో జరగడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పోలీసులు తీరుపై పోలీసుల వర్గాల్లోనే దుమారం రేపే ఈఘటన భాగ్యగనరంలో చోటుచేసు కోవడం సంచళనంగా మారింది.
Read also: Twitter: అలా అయితేనే ఉండండి.. లేకపోతే వెళ్లిపోండి.. ఉద్యోగులకు ఎలాన్ మస్క్ వార్నింగ్
హైదరాబాద్‌లోని మాదన్నపేట్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న వెంకటేశ్వర్లు దంపతులు, వివాహిత ఇంటి సమీపంలో ఉండేవాడు. బాధితురాలు, కానిస్టేబుల్ భార్య.. ఇద్దరు స్నేహంగా ఉండేవారు. ఈ నేపథ్యంలో చనువుగా ఉండే కానిస్టేబుల్, ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. అతన్ని తిరస్కరించడంతో మానసికంగా, శారీరకంగా వేధించడం మొదలెట్టాడు. అతని పద్దతి మార్చకోకపోవడంతో.. 2021లో సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే మొదట అతనికి కౌన్సెలింగ్ చేసి వదలిపెట్టారు. ఐనప్పటికీ వేధింపులు మాత్రం ఆపలేదు. మళ్లీ బాధితురాలు సైదాబాద్ పోలీసులకు ఆశ్రయించింది. దీంతో నిందితుడ్ని మే 2021లో జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. అతను జైలులో ఉన్నప్పుడు, గృహిణి మీర్‌పేట్‌కు వెళ్లింది. జైలు నుంచి విడుదలైన వెంకటేశ్వర్లు ఆమెపై కక్షగట్టాడు. బాధితురాలి చిరునామా, ఫోన్ నెంబర్ తెలుసుకుని భర్త లేని సమయంలో ఆమె ఇంటికి వెళ్లాడు. తనకు సహకరించకపోతే దారుణంగా ఉంటాయని ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని, 2022 ఆగస్టు 17న మహిళపై అత్యాచారం చేసి, ఆమె నగ్న వీడియోలు తీశాడని మీర్‌పేట పోలీసులు తెలిపారు. తరచూ ఇంటికి వెళ్లి ఆమెపై అఘాయిత్యం చేసేవాడు. ఆమె ఫోటోలు, వీడియోలు సేకరించి బెదిరింపులకు దిగేవాడని బాధితురాలు పేర్కొంది. ఇక నవంబర్ 14న, నిందితుడు మరోసారి బాధిత మహిళ ఇంటికి వెళ్లి ఆమె ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని బెదిరించాడు. ఆమె నగ్న వీడియోలను షేర్ చేస్తానని బెదిరిస్తూ మరోసారి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించడంతో ప్రాణాలతో బయటపడిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మీర్‌పేట పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేసి నిందితుడిని మంగళవారం అరెస్టు చేశారు.
VIjayawada Driving Licences: బెజవాడలో విచ్చలవిడిగా డ్రైవింగ్ లైసెన్స్ ల దందా
