Site icon NTV Telugu

Mahabubabad: దారుణం.. ఆరేళ్ల చిన్నారిపై పిచ్చికుక్క దాడి.. తెగిపోయిన చెవి

Untitled Design (7)

Untitled Design (7)

ఆరేళ్ల చిన్నారిపై పిచ్చి కుక్క దాడి చేసింది. ఈ ఘటనలో బాలుడి చెవి పూర్తిగా దెబ్బతిన్నంది. దీంతో కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆరేళ్ల చిన్నారిపై కుక్క దాడికి పాల్పడిన సంఘటన, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో చోటు చేసుకుంది. పట్టణంలోని దుబ్బతాండకు చెందిన ధరావత్ సికిందర్ యశోదల కూతురు ఆరేళ్ల సాయి కీర్తన సోమవారం సాయంత్రం, ఇంటి ముందు ఆరుబయట ఆడుకుంటుండగా అటుగా వెళుతున్న పిచ్చికుక్క సాయి కీర్తన చిన్నారిపై దాడికి పాల్పడింది. ఈ ఘటనలో చిన్నారి చెవి పూర్తిగా గాయపడి తీవ్రంగా రక్తస్రావం అయింది. తక్షణమే చిన్నారిని తొర్రూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రాథమిక వైద్యం అందించారు. పరిస్థితి గమనించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం చిన్నారిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించినట్లు తొర్రూర్ ప్రాథమిక ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

పిచ్చికుక్కలతో ఎంతో ఇబ్బందులు పడుతున్నామంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మున్సిపల్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Exit mobile version