NTV Telugu Site icon

TGSRTC: ప్రయాణికులు టీజీఎస్ఆర్టీసీ గుడ్‌ న్యూస్‌.. భారీగా తగ్గిన బస్ పాస్ ధరలు

Tgsrtc

Tgsrtc

TGSRTC: హైదరాబాద్‌ నగర ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్‌న్యూస్‌ చెప్పింది.జిహెచ్ఎంసీ పరిధిలో ఏసీ బస్సు పాస్ ఛార్జీలను టీజీఎస్ ఆర్టీసీ తగ్గించినట్లు పేర్కొంది. ఎలక్ట్రిక్‌ గ్రీన్‌ మెట్రో లగ్జరీ ఏసీ బస్‌ పాస్‌ ధర 2530 రూపాయలు ఉండగా.. ప్రయాణికుల కోసం రూ.1900 కే అందిస్తుంది. అంటే రూ.630 కు బస్‌ పాస్‌ను ఆర్టీసీ సంస్థ తగ్గించింది. కాగా.. సికింద్రాబాద్ – పటాన్‌ చెరువు (219 రూట్), బాచుపల్లి – వేవ్ రాక్(195 రూట్) మార్గాల్లో నడిచే గ్రీన్‌ మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల్లో ప్రయాణించవచ్చు. ఈ తగ్గింపు వర్తిస్తుంది. ఈ బస్‌పాస్‌తో గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సులతో పాటు ఈ-మెట్రో ఎక్స్‌ ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సులలో ప్రయాణించే వెసులుబాటును ఆర్టీసీ కల్పించినుంది. ఎయిర్‌పోర్ట్‌ మార్గంలో నడిచే పుష్ఫక్‌ ఏసీ బస్సుల్లో ఈ పాస్ చెల్లుబాటు కాదని స్పష్టం చేసింది. మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సు పాస్ కలిగిన వారు రూ.20 కాంబినేషన్ టికెట్ తీసుకుని.. గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల్లో ఒక ట్రిప్పులో ప్రయాణించవచ్చని తెలిపింది. హైదరాబాద్‌లోని టీజీఎస్‌ ఆర్టీసీ బస్సు పాస్ కేంద్రాలలో ఈ పాస్‌లు జారీ చేయనున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది.

Read also: Mallu Bhatti Vikramarka: నేడు వివిధ శాఖలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ…

అధిక చార్జీల కారణంగా నగరంలో ఏసీ బస్సుల్లో ప్రయాణం హాట్ హాట్ గా మారింది. ఏసీ బస్సుల్లో చార్జీలు అధికంగా ఉండడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. మెట్రో రైళ్ల కంటే ఏసీ బస్సుల ధర ఎక్కువగా ఉండటంతో ప్రజలు ప్రయాణానికి ఆసక్తి చూపడం లేదు. గతంలో వేవ్‌రాక్‌ నుంచి ఉప్పల్‌ వైపు వచ్చే బస్సులో ఉదయం, సాయంత్రం వేళల్లో ఐటీ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ప్రయాణించేవారు. రాయదుర్గం వరకు మెట్రో రైలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏసీ బస్సు చార్జీలు ఎక్కువగా ఉండడంతో చాలా మంది మెట్రో రైలులో ప్రయాణిస్తున్నారు. వేవరాక్, గచ్చిబౌలి, కొండాపూర్ వైపు వచ్చే ఏసీ బస్సులను కూడా గణనీయంగా తగ్గించారు. అయితే ఏసీ బస్సుల అధిక చార్జీలను తగ్గిస్తే ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని, నగరంలో ఏసీ బస్సులకు ఆదరణ పెరుగుతుందని ఆర్టీసీ అధికారులు గుర్తించినా ఛార్జీల తగ్గింపు ప్రతిపాదన అమలుకు నోచుకోలేదు. అయితే దీనిపై దృష్టిపెట్టిన టీజీఎస్ ఆర్టీసీ ఏసీ బస్సుల జార్జీలను భారీగా తగ్గించింది. ప్రయాణికులు సులువుగా జర్నీ చేసేందుకు అవకాశం కల్పించనుంది. టీజీఎస్ ఆర్టసీ నిర్ణయంతో ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Kajal Aggarwal : ‘సత్యభామ’ లో ఆ సీన్స్ కోసం ఎంతో కష్టపడ్డా..